కర్నూలు టీడీపీ కార్యకర్తలకు ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కాల్వశ్రీనివాస్ శిల్పా బ్రదర్స్ విషయంలో ఒక స్పష్టత ఇచ్చారు. కార్యకర్తలు - నేతలు కేవలం శిల్పా మోహన్ రెడ్డిని మాత్రమే విమర్శించాలని ఆదేశించారు. ఎవరూ కూడా శిల్పా బ్రదర్స్ అంటూ విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఇంకా పార్టీ వీడి వెళ్లలేదని గుర్తుచేశారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ వీడిన తర్వాత శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైసీపీ వైపు చూస్తున్నారని టాక్.
కాగా.... శిల్పా పార్టీ మార్పుతో కర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ విధానాలతో విభేదించి వైసీపీలో చేరిన శిల్పామోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఫిరాయింపు ఎంపీ ఎస్పీవై రెడ్డి మండిపడుతున్నారు. చాలాకాలంగా యాక్టివ్ గా లేని ఆయన హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టిమరీ శిల్పా వ్యాఖ్యలను ఖండించారు.
ఉప ఎన్నికల్లో శిల్పాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని ఎస్పీవై రెడ్డి బెదిరించారని శిల్పా మోహన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనపై శిల్పామోహన్ రెడ్డి విమర్శలు చేయడం దారుణమన్నారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. నంద్యాలలో ఎవరు అభివృద్ధి కోసం కష్టపడుతున్నారో అందరికీ తెలుసన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/