శిల్పాచౌదరి సంచలనం: సెలబ్రెటీలే బ్లాక్ మనీ వైట్ చేయమన్నారట..

Update: 2021-12-05 01:37 GMT
కిట్టీ పార్టీలతో మొదలుపెట్టి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శిల్పా కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల ముందు నోరువిప్పిన శిల్పా తాజాగా సంచలన విషయాలు బయటపెట్టినట్టు సమాచారం.

సెలబ్రెటీలను మాయ చేసి కోట్లు అప్పుగా తీసుకొని మోసం చేసిన శిల్పా చౌదరి తాజాగా తనను రాధికా రెడ్డి అనే రియల్టర్ మోసం చేసిందని స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం. పోలీసులు గండిపేటలోని ఆమె నివాసం సిగ్నేచర్ విల్లాకు తీసుకెళ్లి ఇంట్లో నుంచి విలువైన పత్రాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో కొంతమంది ప్రముఖుల పేర్లు ఉండడంతో వారికి, శిల్పాకు మధ్య జరిగిన లావాదేవీలపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.

శిల్పా చౌదరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా రియల్ ఎస్టేట్ తోపాటు ఈవెంట్ మేనేజ్ మెంట్ నడుపుతున్న టంగుటూరు రాధికారెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తన దగ్గరు ఆరు రూపాయల వడ్డీకి రాధికా రెడ్డి ఆరు కోట్లు తీసుకుందని విచారణలో శిల్పా వెల్లడించింది.

టంగుటూరు రాధికారెడ్డి జన్వాడలో నివాసముంటోంది. ప్లోరిస్ట్ గా ఈవెంట్స్ చేస్తున్న రాధికారెడ్డి రూ.10 రూపాయల వడ్డీతో కోట్ల రూపాయలు తీసుకున్నట్లు శిల్పా తెలిపింది. ఈ క్రమంలోనే రాధికరెడ్డి సోమవారం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.

సెలబ్రెటీలను శిల్పా చౌదరి కోట్లు తీసుకొని మోసం చేస్తే.. రాధికారెడ్డి ఏకంగా మోసం చేసిన శిల్పానే మోసం చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 6శాతం వడ్డీ ఇస్తానని చెప్పిన రాధిక తన వద్ద రూ.30 కోట్లు తీసుకుందని.. ఆమె తిరిగి తనకు డబ్బులు చెల్లించలేదని చెప్పింది. రాధిక పాత్రపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతు్నారు. శిల్పా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ తన స్థాయిని పెంచుకునేందుకు శిల్పా రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది.

ఇక సెలబ్రెటీలు, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని.. వారంతా బ్లాక్ మనీని వైట్ చేయమని ఇచ్చారని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. రాధికారెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు కాకుండా.. తాను పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుల నుంచి డబ్బులు రాలేదు కాబట్టి నేను ఇవ్వలేకపోయానని.. నేను ఎవరినీ మోసం చేయలేదని శిల్పా వివరించింది.

శిల్పా సిత్రాల్లో బౌన్సర్లు తెరపైకి వచ్చినట్లు వెల్లడించింది. బిల్డప్ కోసం స్టేటస్ సింబల్ గా బౌన్సర్లను నియమించుకున్నట్లు చెప్పింది. ఇక శిల్పా రెండేళ్లు అమెరికాలో ఉండి వచ్చినట్లు తేలింది. అక్కడేమైనా డీలింగ్స్ చేశారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

తను అందరి వద్ద డబ్బులు తీసుకుంటే తనను రియల్టర్ రాధికారెడ్డి మోసం చేసిందనే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలపై మాత్రం శిల్పాచౌదరి నోరు మెదపడం లేదని సమాచారం.

పోలీసుల కస్టడీ ముగియడం.. విచారణ పూర్తికావడంతో శిల్పా చౌదరిని రాజేంద్రనగర్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. దీంతో కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు శిల్పాను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో రెండు కేసుల్లో కూడా పోలీసులు శిల్పాను కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
Tags:    

Similar News