కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో బరిలో దిగే చాన్స్ కోసం తెలుగుదేశం పార్టీలోని నెలకొన్న తీవ్రమైన పోటీ, బయటపడ్డ విబేధాల నేపథ్యంలో రంగంలో ఉండే అభ్యర్థిని తేల్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చక్కటి పరిష్కారం కనిపెట్టారట. అదే బాబుకు అత్యంత ఇష్టమైన `సర్వే` మంత్రం. ఈ విషయాన్ని వెల్లడించింది నంద్యాల రేసులో సీరియస్‌గా ప్రయత్నిస్తున్న శిల్పా బ్రదర్స్‌లో ఒకరైన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి.
ఎమ్మెల్సీగా ఎన్నికైన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ రోజు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని తన ఛాంబర్‌లో శిల్పా చక్రపాణిరెడ్డితో మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ...ఈ విషయంలో తాను మధ్యవర్తిని మాత్రమేనని చక్రపాణిరెడ్డి అన్నారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమన్నారు. నంద్యాలలో పోటీ పడేందుకు పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపథ్యంలో బరిలో దిగితే గెలిచే అభ్యర్థి ఎవరనే దానిపై సీఎం చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఈ సర్వేలలో వచ్చే రిపోర్ట్ ఆధారంగా సీఎం చంద్రబాబు సముచిత నిర్ణయం తీసుకుంటారని శిల్పా వ్యాఖ్యానించారు. కాగా, నంద్యాల సీటు ఎవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని శిల్పా పునరుద్ఘాటించారు.