హైదరాబాద్ సిగలో మరో మణిహారం.. ఐటీ కారిడార్ కు వరం

Update: 2022-11-25 15:30 GMT
హైదరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది. కేసీఆర్ సర్కార్ గద్దెనెక్కాక ఇప్పటికీ 17 ఫ్లై ఓవర్ లను హైదరాబాద్ లో కట్టించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టింది. ఇప్పుడు మరో ఫ్లై ఓవర్ తో ఐటీ సిటీకి కష్టాలు తీర్చింది. ఐటీ కారిడార్ ను బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)తో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లే అవుట్ మొదటి దశ పై వంతెన ప్రారంభానికి సిద్ధమైంది.

ఐకియా మాల్ వెనుక మొదలయ్యే ఈ పైవంతెన 30 అంతస్థుల ఎత్తైన భవాల మధ్య నుంచి సాగిపోతూ విశాఖలమైన ఓఆర్ఆర్ పైకి చేరుతుంది. అంతస్థుల మధ్య వంపులు తిరుగుతూ రెండు అంతస్థుల్లో రూపుదిద్దుకున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఆకాశం నుంచి చూస్తే శిల్పంలా కనిపిస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

హైదరాబాద్ లో ఈ వంతెన ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ కూడలి, బయో డైవర్సిటీ కూడలి మధ్య సుమారు 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణమవుతోన్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ దృష్ట్యా రూపొందించిన ప్రాజెక్టుల్లో శిల్పా లేఅవుట్ పై వంతెన మూడో ప్రాజెక్ట్.  ఇక డిసెంబర్ నెలాఖరులో కొండాపూర్ కూడలి పైవంతెన అందుబాటులోకి రానుంది.

ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి పైవంతెన మీదుగా బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లేఅవుట్ రెండోదశ ప్రాజెక్ట్ డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుందని అంచనా. శిల్పా లేఅవుట్ మొదటి దశ పై వంతెన శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ శిల్పా లేఅవుట్ వంతెన కోసం రూ.250 కోట్లు ఖర్చుపెట్టారు. దాదాపు 956 మీటర్ల ఫ్లైఓవర్ ఇదీ. వెడల్పు 16 మీటర్లు నాలువరసల్లో నిర్మించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News