మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని తక్కువ చేయలేం. అలా అని.. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ విజయం శివసేనకు దెబ్బగా అంచనాకు వస్తే తప్పులో కాలేసినట్లేనని చెప్పాలి. మహారాష్ట్రలోని మిగిలిని మున్సిపాటిలీ.. జిల్లా పరిషత్ లకు జరిగిన ఎన్నికలకు.. బీఎంసీ ఎన్నికల రిజల్ట్ కు మధ్య వ్యత్యాసం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
పాతికేళ్లుగా శివసేన మిత్రత్వంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగా పోటీ చేసింది. బీఎంసీలోని మొత్తం 227 స్థానాల్లో 82 స్థానాల్ని సాధించిన బీజేపీ భారీగా లాభపడినట్లు చెప్పాలి. అలా అని.. శివసేన భారీగా నష్టపోయిందన్న అంచనాకు రావటం తప్పే అవుతుంది. ఎందుకంటే.. సేనను దెబ్బ తీసే ఫలితాల్ని బీజేపీ సాధించలేదన్నది ఇక్కడి కీలక పాయింట్.
బీజేపీ గెలుపు శివసేనకు దెబ్బ ఎంతమాత్రం కాదన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. బీజేపీ గెలిచిన స్థానాలన్నీ.. శివసేన కు చెందినవి కావన్నది మర్చిపోకూడదు. మరింత తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే.. మొత్తం 227 స్థానాలకు శివసేనకు 84 సీట్లు రాగా..బీజేపీ 82స్థానాల్లో విజయం సాధించింది. ఇక.. కాంగ్రెస్ 31.. ఎన్సీపీ 9.. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 7.. మజ్లిస్ 3 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో గెలుపొందారు. బీఎంసీలో పీఠాన్ని చేపట్టటానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 114 సీట్లను ఏ పార్టీ సొంతంగా సాధించలేకపోవటం గమనార్హం.
బీఎంసీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ భారీ ఎత్తున స్థానాల్ని కొల్లగొట్టినా.. అవేమీ శివసేనను దెబ్బ తీసేవిగా లేకపోవటాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే.. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లు కాంగ్రెస్.. ఎన్సీపీ.. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనకు చెందిన సీట్లు కావటం మర్చిపోకూడదు. గత ఎన్నికల్లో 52 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి 31 సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో ఎన్సీపీ 13 స్థానాలకు 9 స్థానాలకు బలం తగ్గిపోతే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన సైతం 28 స్థానాల బలం నుంచి ఏడు స్థానాలకు దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో ముంబయి మహా నగరంలో బీజేపీ గెలుపు.. సేన ఓటమి ఎంతమాత్రం కాదన్నది మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/