రాజకీయాలంటేనే కుట్రలు, కుతంత్రాలు.. ఎత్తులు, పైఎత్తులు.. అందులోనూ మహారాష్ట్ర అంటేనే తలపండిన నాయకుల రాష్ట్రం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఏవిధంగా చూసినా జాతీయ పార్టీలకే కాదు.. రాష్ట్ర పార్టీలకూ కీలకమైనది. అందులోనూ నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారు బీజేపీ కేంద్ర పెద్దలుగా ఉన్న సమయంలో.. మహారాష్ట్ర వంటిచోట్ల అధికారం లేకుండా ఉండడాన్ని అసలు సహించలేరు. అంతేకాదు.. మహారాష్ట్ర గతంలో వారి చేతిలోని రాష్ట్రం.
మెజార్టీ సీట్లు గెలుచుకునీ.. అధికార పీఠం ఎక్కి.. కొద్ది రోజులకే దిగపోవడం అంటే మోదీ, షాలు దిగమింగలేని పరిస్థితి. ప్రతిపక్షంలో కూర్చున్నా.. వారి చూపంతా అధికార పీఠం మీదే ఉంటుంది. ఇది అన్ని పార్టీల్లోనూ సహజమే అయినా.. మోదీ, షా హయాంలోని బీజేపీలోమరీ ఎక్కువ.
వెనుకాముందూ చూసుకోవద్దూ..?
ఈ రోజుల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలంతా నిరంకుశంగా ఉంటున్నారు. వారికిది తప్పదు. లేదంటే.. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన పరిస్థితే. అయితే, ఎన్నాళ్లుగానో.. హిందూత్వాన్ని నమ్ముకుని, దూకుడైన రాజకీయాలు చేసిన శివసేన ఇంకా ఆ ధోరణిలోనే ఉండిపోయింది.
రాజకీయాల్లో సహజమైన కుట్రలు, కుతంత్రాలను ఒంటబట్టించుకోలేపోయింది. దాని ఫలితమే ప్రస్తుతం ఈ దుస్థితి. వాస్తవానికి మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సర్కారుకు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ హెచ్చరికలు ఎదురయ్యాయి. కానీ, దీనిని వారు పెద్దగా పట్టించుకోలేదు.
బీజేపీకి బలం లేకున్నా పోటీ చేస్తుంటే...
మహారాష్ట్ర శాసన మండలిలోని 10 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. అర్థరాత్రి వరకు ఇవి సాగాయి. అయితే, బీజేపీకి నలుగురు సభ్యులనే గెలిపించుకునేంత బలమే (106) ఉంది. కానీ, ఆ పార్టీ ఐదో అభ్యర్థిని బరిలో దింపింది. శివసేన, ఎన్సీపీ రెండేసి, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచాయి. అంటే.. కూటమి పార్టీలు ఒక స్థానం కోల్పోయాయి. వాస్తవానికి బీజేపీ ఐదో అభ్యర్థిని బరిలో నిలిపినప్పుడే శివసేన కూటమిలో అనుమానం రావాల్సింది. తమ పార్టీల్లో శాసన సభ్యులను చీల్చేందుకు ఏమైనా కుట్ర జరుగుతుందా? అనేది ఆలోచించాల్సింది. కానీ, స్తబ్ధుగా ఉండిపోయాయి.
ఉద్ధవ్ స్తబ్ధత సరే.. పవార్ చాణక్యం ఏమైంది?
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేం కాదు. కానీ, అధికార రాజకీయాలకు కొత్త అని ఈ ఉదంతంతో తెలిసిపోతోంది. ఒక సీఎంగా ఉండి.. పార్టీలో జరుగుతున్న కుట్రను ఆయన పసిగట్టలేకపోయారు. బలం లేకున్నా ప్రధాన ప్రత్యర్థి ఐదో అభ్యర్థిని బరిలో నిలిపిందంటే.. కూటమిలోని మిగతా పార్టీల కంటే శివసేననే ముందుగా మేల్కొనాలి. ఎందుకంటే సీఎం వారి నాయకుడే కాబట్టి.
అయితే, ఉద్ధవ్ ఇదేమీ చేయలేకపోయారు. పోనీ.. ఆయనకు అంతగా లోతుపాతులు తెలియవనుకుందాం..? మరి.. రాజకీయాల్లో 60 ఏళ్లుగా తలపండిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఏం చేస్తున్నట్లనే ప్రశ్న రాకమానదు. వాస్తవానికి పవార్.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సంప్రదింపుల్లో బిజీగా ఉన్నారు. దీనిని అదనుగా తీసుకుని బీజేపీ.. శివసేనలో చీలిక తెచ్చింది.
వెరసి.. మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి పాలన రెండున్నరేళ్లకే ముగిసిపోయే పరిస్థితి వచ్చింది.