బీజేపీ కి షాక్: సుప్రీం కోర్టు కు శివసేన, ఎన్సీపీ

Update: 2019-11-24 04:50 GMT
మహారాష్ట్ర రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. రాత్రి కి రాత్రి సమీకరణాలు మార్చేసి మహారాష్ట్ర లో ఎన్సీపీని చీల్చి బీజేపీ గద్దెనెక్కింది. ఫడ్నవీస్ నిన్న ఉదయం 8 గంటలకే సీఎంగా ప్రమాణం చేసి కొలువుదీరారు. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ భారీ షాక్ కు ఖంగుతిన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఇప్పుడు పోరుబాట పట్టాయి. బీజేపీ కి షాకిచ్చేందుకు రెడీ అయ్యాయి.

మహారాష్ట్ర గవర్నర్ అనూహ్య నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్  శనివారం సుప్రీం కోర్టు ను ఆశ్రయించాయి. మూడు పార్టీలు దాఖలు చేసిన పిటీషన్ పై ఆదివారం ఉదయం 11.30 గంటలకు సుప్రీం కోర్టు విచారించనుంది.  మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వానికి బలం లేదని.. బలనిరూపణకు ఇచ్చిన ఈ నెల 30 వరకు గడువును రద్దు చేసి 24 గంటల్లోనే బలనిరూపణ జరపాలని మూడు పార్టీలు సుప్రీం కోర్టును కోరాయి. 30వ తేదీ వరకు గడువు ఇస్తే బేరసారాలకు అవకాశం కల్పించినట్టు అవుతుందని పార్టీలు సుప్రీం కోర్టు ను అభ్యర్థించాయి.

మహారాష్ట్ర లో ప్రస్తుతం బీజేపీ కి 105మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎన్సీపీ నుంచి ఫిరాయించిన అజిత్ పవార్ కు తోడుగా 10-15 మంది ఎమ్మెల్యేలున్నట్టు తెలుస్తోంది. మేజిక్ మార్క్ 145. స్వతంత్రులు 10 మంది వరకూ ఉన్నారు. ఇవన్నీ కలిపినా బీజేపీ మేజిక్ మర్క్ కు  10 మంది వరకూ ఎమ్మెల్యే ల కొరత ఉంటుంది.

ఈ నేపథ్యం లో బల నిరూపణకు సుప్రీం కోర్టు వెంటనే ఆదేశిస్తే బీజేపీ ప్రభుత్వం నిలబడడం కష్టమేనన్న అంచనాలున్నాయి. అయితే అజిత్ పవార్ వెంట ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి  ఫిరాయిస్తే మహారాష్ట్రలో బీజేపీ సర్కారు నిలబడుతుంది. లేదంటే పడి పోవడం ఖాయమంటున్నారు.


Tags:    

Similar News