సుదీర్ఘకాలం కమలనాథులకు అండగా ఉంటూ వచ్చిన శివసేన ఇప్పుడు గుర్రుగా ఉండటం తెలిసిందే. బీజేపీలో మోడీ హవా మొదలైన నాటి నుంచి కమలనాథులకు.. శివసేవకుల మధ్య విభేదాలు పెరిగి పెద్దవి కావటం తెలిసిందే. ఇక.. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా వీరి మధ్య లొల్లి మరింత పెరిగింది.
పెరుగుతున్న విబేధాల విషయంలో దూరం తగ్గించే ప్రయత్నం కమలనాథుల నుంచి లేకుండా పోయింది. మిత్రులు వెంట ఉంటామని చెప్పినా.. తమ బలాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కమలనాథులు ఎవరినీ పట్టించుకోని పరిస్థితి. రోజురోజుకీ తమ బలాన్ని పెంచుకోవటమే తప్పించి.. మిత్రులతో ఉన్న విభేదాలు పరిష్కరించుకునే అంశంపై దృష్టి పెట్టలేదు.
విపక్షంలో ఉన్నంత కాలం తమ తోడుతో లబ్థి పొందిన కమలనాథులు.. ఇప్పుడు కూరలో కరివేపాకులా తీసి పారేయటంపై శివసైనికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ.. అమిత్ షా ద్వయం ఓంటెద్దు పోకడలపై వారు మండి పడుతున్నారు అలా అని ఊరికే తొందరపడకుండా.. అవకాశం వచ్చిన ప్రతిసారీ వారిపై నిప్పులు కురిపిస్తున్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో అగ్రహం వ్యక్తం చేసి.. మోడీ.. అమిత్ షా తీరును ఎండగట్టిన శివసేన తాజాగా మరోసారి మండిపడింది. ఎల్లప్పుడూ మోసం చేయటం రాజకీయాల్లో పనికిరాదంటూ దెప్పి పొడింది. ఇచ్చిన హామీల్ని నెరవేర్చని పక్షంలో ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారంటూ వార్నింగ్ ఇచ్చింది.
మోడీ.. అమిత్ లను సముద్రంలో అలలతో పోల్చి.. సముద్రంలో అలలు వస్తుంటాయి.. పోతుంటాయని.. కానీ తర్వాత ఆ అనవాళ్లు కనిపించవంది. తాజా ఎన్నికల్లో బీజేపీ గెలుపు కూడా అలాంటిదేనని చెప్పటం ద్వారా.. మిత్రధర్మాన్ని గుర్తు చేసింది. మిత్రుడి గాండ్రింపులతో అదిరిపడుతున్న కమలనాథులకు రానున్న రోజుల్లో ఇలాంటివి మరెన్ని ఎదురు కానున్నాయో..?