ఇంతకాలం పదవులను ఆశించికుండా రాజకీయాలు చేసిన శివసేన అధినాయకత్వమైన ఠాక్రే కుటుంబం ఇప్పుడు తొలిసారి తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పీఠం కావాలని కోరుతుండడంతో అక్కడ పీఠముడి బిగుసుకుంది. బీజేపీ - శివసేనను కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితాల అనంతరం శివసేన ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుపడుతుండడం.. అయిదేళ్ల కాలాన్ని చెరి సగం పంచుకుందామని ప్రతిపాదిస్తూ తొలి రెండున్నరేళ్లకు తమ సీఎం సీటు అప్పగిస్తున్నట్లుగా రాసివ్వాలంటూ పట్టుపడుతుండడంతో మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది.
ఎలాగైనా అధికారం తమ వద్దే ఉండాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా శివసేన కూడా అదే పట్టుదలతో ఉంది. అంతేకాదు.. బీజేపీ తమ మాట వినకుంటే తాము ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికైనా సిద్ధమేనంటూ సంకేతాలిస్తోంది. అయితే శివసేన - ఎన్సీపీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కేవలం ఆ రెండు పార్టీలే అయితే పూర్తి మెజారిటీ లేదు. దాంతో కాంగ్రెస్ మద్దతూ వారికి అవసరం. తాజాగా ఈ మూడు పార్టీల కూటమి సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటూ ముంబయి రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే... ఎన్సీపీ మాత్రం తాము శివసేనకు మద్దతిచ్చేది లేదని చెబుతోంది. అదేసమయంలో శివసేన డిమాండ్ సహేతుకమే.. వారికి బీజేపీ రెండున్నరేళ్లు సీఎం కుర్చీ ఇవ్వాలంటూ మద్దతు పలికింది. ‘‘శివసేన డిమాండ్ లో న్యాయం ఉంది. వారి డిమాండ్ కొత్తదేమీ కాదని - 1990లో కూడా ఈ ఫార్ములాను అనుసరించిన కారణంగా తాజాగా వారీ డిమాండ్ చేస్తున్నారు’’ అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఆయన కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న వాదనను కొట్టిపారేస్తున్నారు.
ఇక కాంగ్రెస్ కూడా శివసేనతో కలిసి ప్రభుత్వమేర్పాటు చేసే యోచనేమీ లేదని ప్రకటించింది. ప్రజలు తమ తీర్పు ద్వారా ప్రతిపక్షంలో కూర్చొనే అవకాశాన్ని ఇచ్చారని - ఆ బాధ్యతను నెరవేరుస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలా సాహెబ్ తోరత్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, శివసేన తమ మద్దతు కోరితే అధిష్ఠానం సలహా ప్రకారమే నడుచుకుంటామని మెలిక పెట్టారు.
288 స్థానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 105 సీట్లు - శివసేనకు 44 స్థానాలు దక్కాయి. ఎన్సీపీకి 54 - కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. బీజేపీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిగతా మూడు పార్టీలూ కలవాల్సిందే. కానీ.. శివసేన - కాంగ్రెస్ లు భిన్నధ్రువాలు. వారు కలిసే పరిస్థితి లేనప్పటికీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న చారిత్రక సత్యం ప్రకారం అది కూడా సాధ్యం కావొచ్చు.
శివసేనకు కూడా రాజకీయంగా కొన్ని పడికట్టు సిద్ధాంతాలున్నప్పటికీ ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎంగా చూడాలనుకుంటుండడంతో పుత్ర ప్రేమ ముందు సిద్ధాంతాలు నిలవవని.. కాంగ్రెస్ - ఎన్సీపీల మద్దతును శివసేన కోరినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ఆ దిశగా శివసేన అడుగులు వేస్తోందని వినిపిస్తోంది. అదే జరిగితే.. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తప్ప తమకు అధికారం అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కూడా మద్దతిస్తుందని.. కాంగ్రెస్ మద్దతివ్వడమే కాకుండా ఎన్సీపీని కూడా శివసేన దగ్గరికి చేర్చుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పుడు బీజేపీ విపక్ష స్థానంలో కూర్చోక తప్పదు.
మరోవైపు - ఎన్సీపీ - కాంగ్రెస్ లు కూడా శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ దృష్టి మళ్లించడానికే తాము మద్దతివ్వబోమంటూ ప్రకటనలు చేస్తూ లోలోన శివసేనకు రాయబారాలు పంపుతున్నాయన్న వాదనా ఒకటి వినిపిస్తోంది. ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం సీటును ఆదిత్య ఠాక్రే ఎలా చేజిక్కించుకుంటారో వేచి చూడాలి.