మతంతో రాజకీయాలు భారతరాజకీయాలకు కొత్తేం కాదు. సెక్యులర్ పేరుతో మతపరమైన రాజకీయాల్ని గుట్టుగా చేయటం పార్టీలకు మామూలే. అయితే. ఇలాంటి విషయాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా.. మతంతోనే నేరుగా రంగంలోకి దిగటం కొన్ని పార్టీలకు అలవాటే. హైదరాబాదీయులకు సుపరిచితమైన కరడుగట్టిన మత మజ్లిస్.. దేశ వ్యాప్తంగా తన అతివాద హిందుత్వ పోకడలతో చెలరేగిపోయే శివసేనలు తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇంతకాలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన మజ్లిస్.. ఇప్పుడు తన మత రాజకీయ ఊడల్ని మరింత విస్తరించేందుకు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహారాష్ట్ర బరిలో దిగి ఊహించని విజయాల్ని సొంతం చేసుకున్న మజ్లిస్.. తాజాగా బీహార్ ఎన్నికల్లోనూ బరిలోకి దిగాలని తహతహలాడుతోంది. హైదరాబాద్.. మహారాష్ట్రల్లో వర్క్ వుట్ అయిన ఫార్మూలాను ఉపయోగించి బీహార్ లోనూ తానో రాజకీయ శక్తిగా మారాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన మజ్లిస్.. అందుకోసం కసరత్తు మొదలెట్టింది.
మజ్లిస్ రంగప్రవేశంపై బీజేపీ వెనుక ఉందంటూ ఒకనాటి మజ్లిస్ మిత్రుడైన కాంగ్రెస్ ఆరోపించింది. తమ మధ్య అలాంటి ఒప్పందం జరగలేదని.. ఎలాంటి భేటీ జరిగింది లేదని బలంగా వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బీహార్ ఎన్నికల్లో శివసేన రంగప్రవేశం చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించటం కలకలం రేపుతోంది. ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన లాంటి పార్టీ బీహార్ ఎన్నికల్లో రంగప్రవేశం చేయటం.. మొత్తం సమీకరణల్నే మార్చేసే వీలుందని చెబుతున్నారు.
మొత్తం 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు శివసేన ప్రకటించింది. శివసేన ఎంట్రీతో బీజేపీ వర్గ ఓటు బ్యాంక్ గా ఉన్న వారిలో కొంత మార్పు రావటంతో పాటు.. బీహార్ తుది ఫలితంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ బీహార్ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు కారణం అవుతుందంటున్నారు. ముస్లింల బలం ఎక్కువగా ఉన్న చోట మజ్లిస్ బరిలోకి దిగితే.. హిందువులు ఎక్కువగా ఉన్న చోట సేన తన సత్తా ప్రదర్శించాలని తహతహలాడుతోంది. మరి.. తది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి?