చేసిన ఒక్క వెధవ పనితో దేశ వ్యాప్తంగా సుపరిచితమయ్యారు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్. ఒళ్లు బలుపుతో.. ఎయిరిండియా ఉద్యోగిపై చేయి చేసుకోవటమే కాదు.. చేసిన దుర్మార్గాన్ని గొప్పగా చెప్పుకోవటం తెలిసిందే. ఎయిరిండియా ఉద్యోగిని కొట్టానని.. పాతిక చెప్పుదెబ్బలు కొట్టిన విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటమే కాదు.. అలాంటి పని ఎలా చేస్తారు? సారీ చెప్పరా? అన్న ప్రశ్నకు నో అంటే నో అనేసిన ఆయన.. చేసిన పనికి పడాల్సిన తిప్పలు పడుతున్నారు.
ఉద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరించిన ముదురు ఎంపీకి ముకుతాడు వేసేందుకు ఎయిరిండియా ఆయన్ను విమానటిక్కెట్లు జారీ చేయకుండా నిలిపివేయటమే కాదు.. ఆయనపై బ్యాన్ విధించారు. తర్వాతి దశలో బ్యాన్ ఎత్తేసినా.. ఆయనకు టికెట్లు అయితే అమ్మని పరిస్థితి. దీంతో.. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి రావటానికి ఆయన పడుతున్న తిప్పలు అన్నిఇన్ని కావు.
నాలుగుసార్లు టికెట్లు కొనే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన టికెట్లను బ్లాక్ చేసేయటంతో రైల్లోనూ.. రోడ్డు మార్గంలోనూ పార్లమెంటుకు హాజరయ్యేందుకు చాలానే ప్రయత్నించారు. అయితే.. ఇదంత తేలికైన వ్యవహారం కాదన్న విషయం ఆయనకు అర్థమైంది. అదే సమయంలో.. తాను ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని పార్లమెంటులో చెబుతానన్న రవీంద్ర గైక్వాడ్.. తాజాగా తనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ఎంపీగా ఉన్నారు కదా.. విమానాలు ఎక్కటానికి ఒప్పుకోపోతే.. చార్టర్ ప్లైట్లలో వెళ్లొచ్చు కదా? అన్న ప్రశ్నను సంధించారు. దీనికి బదులిచ్చిన ఆయన.. తాను చాలా పేదవాడినని.. చార్టర్ విమానాల ఖర్చును భరించే స్థోమత తనకు లేదని చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఏమిటంటే.. ఛార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లేందుకు డబ్బుల్లేవని చెప్పిన ఈ పేద ఎంపీ కోసం శివసేన పార్టీ ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయటంతో ఆయన.. ఢిల్లీకి వచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/