శివసేనకు చెందిన మహరాష్ట్ర ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేసిన తప్పునకు శిక్ష అనుభవిస్తున్నారు. ఎయిరిండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన ఆయనపై ఎయిర్‌లైన్స్ నిషేధం విధించడంతో...ఎటు వెళ్లాలన్నా పెద్ద చిక్కొచ్చిపడింది. ఇప్పటికే రెండుసార్లు ఆయన బుక్ చేసుకున్న టికెట్‌ను ఎయిరిండియా రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ నుంచి పుణెకు రైలులో వచ్చిన గైక్వాడ్.. ఇవాళ మళ్లీ ఢిల్లీకి చేరుకునేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. పార్లమెంట్‌కు హాజరు కావడానికి ఢిల్లీకి ఆయన కారులో రావడం విశేషం.
అయితే ఆయన ఢిల్లీకి వచ్చినప్పటికీ సభకు హాజరు కాలేదు. ప్రయాణ బడలిక కారణం అయి ఉంటుందని, గురువారం హాజరవుతారని గైక్వాడ్ సన్నిహితులు తెలిపారు. కాగా,ఇవాళ ఢిల్లీ వెళ్లడానికి రవీంద్ర గైక్వాడ్.. హైదరాబాద్ నుంచి ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 551లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే విషయం తెలిసిన వెంటనే ఎయిరిండియా దాన్ని రద్దు చేసింది. అంతకుముందు మంగళవారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి కూడా ఆయన టికెట్ బుక్ చేసుకుంటే.. దానినీ రద్దు చేసింది ఎయిరిండియా. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ అనంతరం కారులోనే ఢిల్లీకి బయల్దేరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/