మొత్తానికి మహారాష్ట్ర సంక్షోభం ఇపుడు పతాక స్థాయికి చేరింది. దశాబ్దాలుగా పచ్చగా ఉన్న పార్టీ ఇపుడు నిట్ట నిలువుగా కాదు పూర్తిగా చీలింది. కేవలం బాల్ థాక్రే కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది నేతలు తప్ప శివసేన జనమంతా రెబెల్స్ అయిపోయారు. పెద్దగా ఆకర్షణ లేని రెబెల్ మంత్రి ఏక్ నాధ్ షిండే వైపుగా మళ్లారు. షిండే శివసేన వారసుడు కాదు, దగ్గర బంధువు అంతకంటేకాదు. ఇక ఏకమొత్తంగా మహారాష్ట్రను ఫోకస్ చేయగల బిగ్ ఫిగర్ కాదు. కానీ ఆయన పిల్లి మెడలో గంట కట్టారు.
అందుకే ఆయన తొలి అడుగుతో చీలికకు బీజం పడింది. అందుకే ఆయన ఓవర్ నైట్ లీడర్ అయ్యారు. సరే కానీ ఆయన సరేనంటే పోలోమంటూ వెంట వచ్చేయడానికి శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమీ ఆలోచన లేని వాళ్ళా. వాళ్ళంతా ఢక్కా మెక్కీలు తిన్న వారే. ఇపుడు షిండే శిబిరంలో ఉన్న వారిలో దశాబ్దాలుగా ఎమ్మెల్యేలుగా పని చేసిన వారున్నారు. ప్రస్తుత మంత్రులు ఉన్నారు. ఇంకా సీనియర్ నేతలు ఉన్నారు.
మరి వారు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎందుకు బయటకు వచ్చారు. అంటే అది అచ్చంగా బాలధాక్రే వారసులు చేసుకున్నదే. వారి స్వయంకృతమే అని చెప్పాలి. బాల్ థాక్రేకు ఉద్ధవ్ థాక్రే కుమారుడే కానీ అచ్చమైన రాజకీయ వారసుడు కాడు అనే అంటారు. ఆయనకు రాజకీయ మెలకువలు ఏవీ తెలియవు. అంతే కాదు ఆయనకు పదవుల మీద కూడా పెద్దగా వ్యామోహం లేదని కూడా అంటారు.
అయితే ఆయన భార్య రశ్మీ థాక్రేకు బాగా ఆసక్తి ఉంది. అంతే కాదు తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను భావి సీఎం ని చేయాలన్న కోరిక ఇంకా మెండుగా ఉంది. ఇక యువ నేత ఆదిత్య ఠాక్రే అయితే ఆంతా తామే అన్న భ్రమల్లో తేలియాడారు. తాత తండ్రులు ఎపుడూ అధికార వాసనలు చూడలేదు. ఈ కుర్ర నాయకుడు మాత్రం ఏకంగా మంత్రి కావడమే కాదు డీఫ్యాక్టో సీఎం గా శాసించడం మొదలెట్టారు.
అంతులేని అధికారం, సంపన్న మహారాష్ట్రను శాసించే అవకాశం, గత రెండున్నరేళ్ళుగా ఆదిత్యా థాక్రే హవా అలా సాగింది అని చెబుతారు. ఇక ఉద్ధవ్ థాక్రే సతీమణి రశ్మీ థాక్రే కూడా ఏమి తక్కువ తినలేదు. ఆమె కధ మొత్తం తన వైపు నుంచి నడిపించారు అంటారు. ఆమె ఆదేశాలు కూడా ప్రభుత్వానికి చేసేవారు అని అంటారు.
మరో వైపు చూస్తే శరద్ పవార్ కూటమికి పెద్దన్నగా తన కంట్రోల్ లో అన్నీ ఉంచుకున్నారు. ఇక్కడ చూస్తే శివసేనలో ఉద్ధవ్ ఉత్సవ్ విగ్రహం అయిపోయారు. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండున్నరేళ్ళుగా శివసైనికులు మధనపడిపోయారు. ఆఖరుకు సీఎం తో వారికి అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు అయితే దర్శన భాగ్యం కరవు.
దాంతో టాప్ టూ బాటం అంతా చిర్రెత్తిపోయి ఉన్నారు. ఈ అసంతృప్తిని పసిగట్టిన బీజేపీ పావులు కదిపింది. షిండే లైన్ లోకి వచ్చారు. అలా శివసేనలో చిచ్చు రాజుకుని కధ మొత్తం క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇదీ కంచుకోట లాంటి శివసేన మంచుకోటలా కరిగిపోయిన కధ.
మరి దీనిని బట్టి గుణపాఠం ఎవరైనా నేర్చుకుంటారా. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో కూడా అన్నీ అని కాదు కానీ చాలా చోట్ల నిరంకుశత్వమే రాజ్యమేలుతోంది అని చెబుతారు. చాలా మంది ముఖ్యమంత్రులు ఏళ్ళూ పూళ్ళూ గడచినా తమ ఎమ్మెల్యేలకు దర్శనం ఇవ్వడంలేదు అన్న కధలూ ఉన్నాయి. కొందరు అయితే వారసులకు అంతా అప్పగించేసి దేశాలు పట్టి తిరుగుతున్నారు.
అసలు నేతను నమ్ముకుని రాజకీయాలు చేసేవారు కొసరు నేతల బారిన పడినపుడే అక్రోశం అలా తన్నుకు వస్తుంది. అది లావాలా పొంగి పొరలిన నాడు శివసేన ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. దేశంలో పురాతన ప్రాంతీయ పార్టీలలో ముందు వరసలో ఉండే శివసేనలో అగ్గి రాజుకోగా లేనిది మిగిలిన వాటిలో ఎంతసేపు. అందువల్ల తాము సీట్లో కూర్చోవడానికి కారణం అయిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రులు ఎవరైనా నిరాదరణ చేస్తే వెంటనే పట్టించుకోవాలి.
వారికి టైం ఇచ్చి నెలకో రెండు నెలలలో ముచ్చటించాలి. ఇక చేతిలో అధికారం ఉంది కదా అని ఫ్యామిలీస్ ని తెచ్చి రుద్దేసినా కూడా రివర్స్ కొడుతుంది. దేనికైనా పరిమితి ఉంది. అది దాటితే మహా సంక్షోభమే. అదే శివసేన ఎపిసోడ్ చెబుతున్న నీతి, నయా రాజకీయ నీతి.