సంజయ్ కు దక్కింది మరీ రూ. కోటేనా ?

Update: 2022-08-02 06:15 GMT
శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబానికి దక్కింది మరీ కోటి రూపాయలేనా ? ఈ విషయంలోనే అందరు ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని పత్రాచల్ హౌసింగ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగిందని ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సంజయ్ రౌత్ ను అరెస్టు చేశారు. స్కాం మొత్తం రూ. 1300 కోట్లుగా లెక్క తేల్చింది ఈడీ. రు. 1300 కోట్ల  కుంభకోణమంటే మామూలుది కాదు అనే అందరు అనుకున్నారు.

తీరా ఈడీ ఉన్నతాధికారులు సోమవారం ప్రత్యేక కోర్టుకి ఇచ్చిన వివరాలు చూస్తే సంజయ్ కుటుంబానికి దక్కింది కేవలం కోటి రూపాయలేనట. 1300 కోట్ల రూపాయల కుంభకోణమని చెప్పి సంజయ్ కుటుంబానికి దక్కింది కేవలం కోటి రూపాయలు మాత్రమే అంటేనే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ మాత్రానికే ఈడీ ఇంతలా ఓవర్ యాక్షన్ చేయాలా అని అనుకుంటున్నారు. ఎందుకంటే అవినీతి పరుడిగా ముద్రపడిన ప్రభుత్వంలో కిందిస్థాయి ఉద్యోగే కోట్ల రూపాయలు సంపాదించుకంటున్నాడు.

రెవెన్యూ శాఖలో ఆర్ఐగా ఎంఆర్వోగా పనిచేసిన దొరికిన వాళ్ళ దగ్గరే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. అలాంటి మహారాష్ట్ర ప్రభుత్వంలోనే చక్రం తిప్పిన కీలక వ్యక్తి, ముఖ్యమంత్రికి మించి అధికారాలు చెలాయించిన సంజయ్ రౌత్ కు అంత పెద్ద కుంభకోణంలో దక్కింది కేవలం కోటి రూపాయలు మాత్రమే అని ఈడీ చెప్పటం పెద్ద జోక్ గా మారిపోయింది. పది రూపాయలు అక్రమంగా సంపాదించినా తప్పే అనటంలో సందేహం లేదు. కానీ సంజయ్ అరెస్టు నేపథ్యంలో ఈడీ చేసిన ఓవర్ యాక్షనే ఇపుడు ప్రశ్నార్ధకమవుతోంది.

సంజయ్ పైన ఇంతగా గురిపెట్టి ఈడీతో వెంటాడి వేటాడి చివరకు పట్టుకున్నది కోటి రూపాయలు సంజయ్ కుటుంబానికి అందిందని చెప్పటానికేనా ? శివసేన పత్రిక సామ్నాలో నరేంద్రమోడీ, అమిత్ షా పై రెగ్యులర్ గా వ్యతిరేకత కథనాలు వస్తున్నాయి.

ఈ పత్రిక ఎడిటోరియల్ వ్యవహారాలన్నింటినీ సంజయే చూసుకుంటున్నారు. అందుకనే థాక్రే కన్నా బీజేపీ పెద్దలకు సంజయ్ మీదే పీకల్లోతు కోపముందని అందరికీ తెలుసు. అసలు ఈ కోటి రూపాయల ఆరోపణలన్నా నిలుస్తాయా ?
Tags:    

Similar News