కరోనా ‘వ్యాక్సిన్​’ బీహారోళ్లకేనా.. ఇదీ రాజకీయమేనా..? బీజేపీపై శివసేన - టీఆర్ ​ఎస్​ మండిపాటు!

Update: 2020-10-23 15:30 GMT
బీహార్​ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్​ ఇస్తామంటూ అక్కడి ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. కాగా దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్రమశిక్షణ గల పార్టీగా బీజేపీ చివరకు ‘కరోనా వ్యాక్సిన్​’ ను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని ఆరోపణలు వస్తున్నాయి. ‘అంటే ఒక్క బీహార్​ ప్రజలకు వ్యాక్సిన్​ ఇస్తే మిగిలిన రాష్ట్రాల ప్రజలు ఏమైపోవాలి. బీజేపీ మరీ ప్రాంతీయపార్టీల స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నది’ అంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై శివసేన ఎంపీ సంజయ్​రౌత్​, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ స్పందించారు.

‘భారత్​ బయోటెక్​ కరోనా వ్యాక్సిన్​ తీసుకొస్తుంది కదా! అది తెలంగాణ ప్రజలకు ఎప్పుడిస్తారు? అంటూ ఓ ఔత్సాహికుడు ట్విట్టర్​లో కేటీఆర్​ను ప్రశ్నించాడు. దీనికి కేటీఆర్​ బదులిస్తూ ‘బ్రదర్​ కరోనా వ్యాక్సిన్​పై మనం ఇప్పుడు ఆశలు పెట్టుకోవద్దు.. దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల వ్యాక్సిన్​ డోసులు బీహార్​ ప్రజల కోసం దాచిపెట్టి ఉంచారు. వాళ్లకు వేశాక మిగిలిన రాష్ట్రాల ప్రజలకు ఇస్తారు’ అంటూ బదులిచ్చారు. కాగా ఈ రీట్వీట్​ ట్విట్టర్​లో మారుమోగుతోంది.

సదరు నెటిజన్​ ఈ ట్వీట్​ను డిలిట్​ చేసినప్పటికీ కేటీఆర్​ రీట్వీట్​ మాత్రం ట్రెండ్​ అవుతూనే ఉండటం విశేషం. అయితే అంతకు ముందు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ దారుణ రాజకీయాలు చేస్తోంది. గతంలో బీజేపీ సిద్ధాంతం ఏమిటంటే ‘ మాకు రక్తం ఇవ్వండి.. మేము మీకు స్వేచ్ఛ నిస్తాం’ అని కానీ ఇప్పుడు అది మారిపోయింది. ‘మాకు ఓటు వేయండి మేము వ్యాక్సిన్​ ఇస్తాం’ ఇలా భారతీయ జనతాపార్టీ రోజురోజుకూ రాజకీయంగా దిగజారుతోంది.. అంటూ ఆయన ఆరోపించారు.
Tags:    

Similar News