ఆ మ‌త పెద్ద‌ను రాష్ట్రప‌తి చేయాల‌ట‌

Update: 2017-03-28 05:36 GMT
రాష్ట్రప‌తి ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది అనూహ్య‌మైన వ్య‌క్తులు తెర‌మీద‌కు వస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ అగ్ర‌నేత ఎల్‌ కే అద్వానీ పేరును రాష్ట్రప‌తి ప‌ద‌వి కోసం ప్ర‌ధాన‌మంత్రి ఓకే చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కాలేదు. కాగా, ఈ రేసులోకి అనూహ్యంగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ‌చ్చి చేరారు. అయితే భ‌గ‌వ‌త్ త‌నంత తానుగా ఈ ప‌ద‌వి ఆశించ‌లేదు. అలా అని రాష్ట్రీయ స్వ‌యం సేవక్ సంఘ్ సైతం ప్ర‌తిపాదించ‌లేదు. సంఘ్‌ సిద్ధాంతాల‌తో చాలా ద‌గ్గ‌రగా ఉండే శివ‌సేన ఎంపీ ఈ డిమాండ్ తెర‌మీద‌కు తెచ్చారు.

శివసేన త‌ర‌ఫున జాతీయ రాజ‌కీయాల‌పై త‌ర‌చూ స్పందించే ఎంపీ సంజయ్ రౌత్ రాష్ట్రప‌తి ప‌ద‌వి విష‌యంలో త‌న విశ్లేష‌ణ చేశారు. మచ్చలేని వ్యక్తి రాష్ట్రపతి పదవిని అధిరోహించాలన్నారు. భారత్ హిందూ దేశంగా ఉండాలన్న కల నెరవేరాలంటే రాష్ట్రపతిగా భగవత్‌ ను ఎంపిక చేయాలన్నారు. ఆయ‌న పేరును రాష్ట్రపతి ఎంపికకు పరిశీలించాలని ఎన్డీఏ సర్కార్‌ కు సూచించారు. కాగా, ఇప్పటికే ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ - ఇటీవల యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ ను బీజేపీ నియమించినందున రాష్ట్రపతి పదవిపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన సంజయ్.. దీనిపై తుది నిర్ణయం తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రేదేనని తుది నిర్ణ‌యం త‌మ బాస్ కోర్టులో పెట్టేశారు.

ఇదిలాఉండ‌గా కీల‌క‌మైన రాష్ట్రప‌తి ప‌ద‌వి ఎంపిక విష‌యంలో బీజేపీ త‌మ కీల‌క భాగ‌స్వామి అయిన శివ‌సేన‌తో క‌లిసి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను ఈ వారం ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ భోజనానికి పిలిచారని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే అదేం లేదని శివసేన నాయకులు చెప్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News