ఎత్తులు.. పైఎత్తులతో మహారాష్ట్ర రాజకీయం అంతకంతకూ రసకందాయం లో పడుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో చేతి వరకూ వచ్చిన అవకాశం నోటి వరకూ వెళ్లే సమయానికి చేజారిపోయిన వైనం పై శివసేన కుతకుతలాడిపోతోంది. తనకు దక్కనిది బీజేపీ కి అస్సలు దక్కకూడదన్నట్లుగా ఉన్న సేన అధినాయకత్వం ఇప్పడు కొత్త ఎత్తు వేసింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయొచ్చన్న నానుడికి తగ్గట్లే.. పవర్ కు పవర్ తోనే బదులివ్వాలని డిసైడ్ అయ్యింది.
డిప్యూటీ సీఎం పదవి ఆశ చూపించి తమ వైపు కు లాక్కున్న బీజేపీ కి బుద్ధి చెప్పేందుకు శివసేన అధినాయకత్వం సరికొత్త ఆఫర్ ను తెర మీదకు తెచ్చింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ ను దారికి తెచ్చుకునేందుకు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చేందుకు సిద్ధమైంది. అజిత్ కు బీజేపీ నాయకత్వం డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తానన్న వేళ.. కమలనాథులతో కాకుండా ఎన్సీపీ తోనే ఉండటం ద్వారా.. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని అజిత్ పవార్ కు అప్పగించేందుకు సేన సై అంది.
ఇప్పటి వరకూ కొత్త మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం లో ఐదేళ్ల పాటు సీఎం పీఠం తమ వద్దనే ఉంచు కోవాలని భావించిన సేన.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా రెండున్నరేళ్ల పాటు అజిత్ కు పవర్ ఇచ్చేందుకు ఓకే చెప్పేసింది. మరి.. ఈ భారీ ఆఫర్ కు అజిత్ ఓకే అంటారా? లేక.. కమల నాథులకు కసెక్కిపోయేలా చేస్తే తనను అడ్డంగా బుక్ చేస్తారన్న భయంతో నో చెబుతారా? అన్నదిప్పుడు ఆసక్తి కరంగా మారింది.