తాజ్‌ మహాల్‌ ను గుడిపై నిర్మించారా?

Update: 2015-04-10 19:10 GMT
ద్వారక పీఠాధిపతి, శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన తాజ్‌ మహల్‌ నిజానికి శివుని గుడి అని అన్నారు.  పాలరాతి శిల్పాలతో నిర్మించిన తాజ్‌ మహల్‌ క్రింద దేవాలయం ఉందని..అందులో దేవదేవుడైన శివుడు నిద్రిస్తున్నారని చెప్పారు.

తన వాదనాలకు తగ్గ ఇతివృత్తాలను సైతం శంకరాచార్య వివరించారు. ప్రస్తుతం తాజ్‌ మహల్‌ ఉన్నచోట రాజా పరందేవ్‌ క్రీ.శ 1156లో దేవాలయాన్ని నిర్మించారని చెప్పారు. అయితే ఆ స్థలాన్ని షాజహాన్‌ 1631-32 సంవత్సరాల కాలంలో ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పరందేవ్‌ నిర్మించిన దేవాలయంలో ఇప్పటికీ ఆగ్రేశ్వర్‌ మహాదేవ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు.

సాయిబాబ హిందూ దేవుడు కాదని, ఆయన గొడ్డుమాంసం తిన్నారని శంకరాచార్య కొద్దికాలం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా గోమాంసాన్ని నిషేధించాలంటూ ఇటీవల శంకరాచార్య డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News