ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న నటుడు శివాజీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతవరకు ఎంపీలను, ఎమ్మెల్యేలపై నోరు చేసుకున్న ఆయన ఈసారి వారితోపాటు కేంద్రమంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై ఆయన నిప్పులు చెరిగారు.
రాష్ర్టం నుంచి ఇంతమంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం అని నిలదీశారు. ఎంపీలంతా ఏకమైతే ప్రత్యేక హోదా దానంతకు అదే వస్తుందని చెప్పారు..రాజకీయాలు పక్కనబెట్టి, అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రత్యేక హోదాపై ఏమీ చేయకుండా మౌనంగా ఎందుకున్నారని వెంకయ్యనాయుడుపై మండిపడ్డారు. "68 ఏళ్లు దాటాయి... ఇంకా ఎందుకు సార్ మీకు పదవిపై ప్రేమ? పదవిలో ఉండి ఏం సాధిస్తారు సార్?" అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు అందరూ కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరు సభలో కోటి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, అతని పరిస్థితి విషమంగా ఉండటంపై శివాజీ విచారం వ్యక్తం చేశారు. హోదా కోసం ఆత్మహత్యాయత్నం జరగడం అమానుషమన్నారు. ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పొడద్దని కోరారు. హోదాను పోరాటం ద్వారా సాధించుకుందామన్నారు.
రాబోయే తరాల కోసం ప్రత్యేక హోదా కావాలని శివాజీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా చారిత్రక అవసరమని, నేతలు కళ్లు తెరవాలన్నారు. తమకు ప్రత్యేక ప్యాకేజీ వద్దని, హోదా మాత్రమే కావాలని తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే..ఇంతవరకు రాష్ట్రవిభజన సమయంలో ఎలాగైతే ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమమే మరోసారి పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడికి ఏమైనా జరిగితే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతోనైనా పవన్ కల్యాణ్ ఇకనైనా మేల్కోవాలని కోరారు.
మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గళమెత్తుతున్న శివాజీ...పవన్ కళ్యాణ్‌ను లాగకుండా ఉండకపోవడం విశేషం.