ఉత్తరప్రదేశ్ లోని అధికారపక్షంలో లుకలుకలు తీవ్రతరం అయ్యాయి. సమాజ్ వాదీ పార్టీలో మొదలైన అంతర్గత విభేదాలు రోజురోజుకీ తీవ్రతరం అవుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఆసక్తికరంగా మారాయి. మరికొద్ది నెలల్లో యూపీలో ఎన్నికలు జరగనున్న వేళ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఐకమత్యంతో అందరూ కలిసి ఉండాల్సిన వేళ.. అలకలు.. ఆగ్రహాలతో ఎవరికి వారు తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని డ్యామేజ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
యూపీ సర్కారులో కీలకమంత్రుల్లో ఒకరైన శివపాల్ యాదవ్ ను ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తొలగించటంతో ఈ రచ్చ షురూ అయ్యింది. వాస్తవానినిక శివపాల్ యాదవ్ ఎవరో కాదు. ముఖ్యమంత్రి అఖిలేశ్ కు సొంత బాబాయ్.అయినప్పటికీ పార్టీ పరపతిని పెంచేందుకు వీలుగా.. తనకేమాత్రం పొసగని బాబాయ్ మంత్రిపదవిని తీసేసేందుకు వెనుకాడలేదు. ఈ నిర్ణయం పార్టీ చీఫ్ కమ్ అఖిలేశ్ తండ్రి ములాయంసింగ్ కు ఎంతమాత్రం నచ్చలేదు. పార్టీలో బలమైన వర్గాన్ని కలిగి ఉన్న శివపాల్ యాదవ్ ను మంత్రి పదవి నుంచి తప్పించటం పార్టీకి భారీగా నష్టం వాటిల్లుతుందన్న భావనతో ఊహించని విధంగా తన కొడుకు నిర్ణయాన్ని తప్పుపట్టటమే కాదు.. యూపీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
తండ్రి తీసుకున్న నిర్ణయంపై కుమారుడు షాక్ తిన్న పరిస్థితి. తనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తొలగించటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పుండు మీద కారం జల్లినట్లుగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి కొడుకును తొలగించిన ములాయం.. ఆ పదవిని తన తమ్ముడు శివపాల్ యాదవ్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అఖిలేశ్ కు.. ఆయన వర్గాన్ని తీవ్రంగా బాధించింది.
ఇదిలాఉండగా.. తాజాగా అఖిలేశ్ కు మరో బాబాయ్ నుంచి సాంత్వన లభించింది. అఖిలేశ్ తో భేటీ అయిన ఆయన.. పార్టీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్ ను తొలగించటం పార్టీ తీసుకున్ననిర్ణయం అని.. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి.. పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించటం కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే తప్పించి.. మరొకటి కాదని.. సీఎంను చిన్నబుచ్చటం ఎంతమాత్రం కాదంటూ పరిస్థితిని సర్దిబుచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా.. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ చీఫ్ కమ్ తన అన్న ములాయం సింగ్ యాదవ్ తనకు అప్పగించిన యూపీ సమాజ్ వాద్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై గుర్రుగా ఉన్నఆయన.. పార్టీకి గుడ్ బై చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేస్తున్న వేళ.. ఇలాంటి పరిణామాలపై సమాజ్ వాదీ పార్టీ వర్గాలకు మింగుడుపడనివిగా మారినట్లుగా చెబుతున్నారు.