అనుష్క వల్లే విరాట్ కోహ్లీ విఫలం అవుతున్నాడట?

Update: 2022-01-24 17:30 GMT
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హనీమూన్ పీరియడ్ ముగిసి కెప్టెన్సీ కూడా కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు ఐదారేళ్లు టీమిండియా క్రికెట్ లో వెలుగు వెలిగిన విరాట్ ఇప్పుడు ఫాం కోల్పోయి.. కెప్టెన్సీలో  కప్ లు గెలవలేక వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం విరాట్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరికీ విరాట్ కోహ్లీ లోకువైపోయాడు. విరాట్ సాధించిన గొప్ప విజయాలను మరుగునపడేలా కొందరు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరికి విరాట్ కోహ్లీ లోకువైపోయాడు. విరాట్ కోహ్లీపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు మాజీ క్రికెటర్లు.  

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం.. ఆ తర్వాత అతడిని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ భారత క్రికెట్ బోర్డు సెలక్టర్లు నిర్ణయం తీసుకోవడం జరిగిపోయాయి.

టెస్టుల్లో అయనా కెప్టెన్ గా కొనసాగుతాడులే అనుకుంటున్న సమయంలో కేప్ టౌన్ టెస్టు ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకొని అందరినీ అవాక్కయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ.

తాజాగా సెంచరీ చేయని విరాట్ కోహ్లీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. దీంతో కోహ్లీని టార్గెట్ చేసుకొని అవాకులు,చెవాకులు పేల్చుతున్నారు మాజీ క్రికెటర్లు. ఇప్పుడు ఈ లిస్ట్ లో పాక్ మాజీ క్రికెటర్ షోయాబ్ అక్తర్ కూడా చేరాడు.

బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకోవడం వల్లే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాత మారిందంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. పెళ్లి విషయంలో కోహ్లీ తొందరపడ్డాడని తెలిపాడు.  పెళ్లి అనేది విరాట్ బ్యాటింగ్ పై ప్రభావం చూపిందన్నాడు.  అతడి ప్లేసులో తాను ఉంటే పెళ్లి కూడా చేసుకోకపోయేవాడనని అక్తర్ స్పష్టం చేశాడు.

నేను విరాట్ కోహ్లీ ప్లేసులో ఉంటే కేవలం పరుగులు చేస్తూ క్రికెట్ ను ఎంజాయ్ చేసేవాడిని.. బ్యాటర్ గా ఈ 10-12 ఏళ్ల సమయం ఎప్పటికీ తిరిగిరాదు.. పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు. ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండాలని కూడా అనడం లేదు. భారత జట్టుకు ఆడుతున్నప్పుడు ఆ కాస్త సమయాన్ని క్రికెట్ కు కేటాయించి అస్వాదించాలంటున్నాని షోయాబ్ అక్తర్ తెలిపాడు.
Tags:    

Similar News