పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై.. ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో పీఎస్బీ పెద్దలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ల నిర్లక్ష్యం వల్లే ఆటగాళ్లకు కరోనా సోకిందని విమర్శించారు. మిగతా దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే పీఎస్బీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అక్తర్ ఫైర్ అయ్యారు. ఆటగాళ్లకు కరోనా సోకడంతో పీఎస్ఎల్ ( పాకిస్థాన్ సూపర్ లీగ్) వాయిదా పడింది. ఇందుకు కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డేనని అక్తర్ మండిపడ్డారు.
పీఎస్ఎస్ లో ఆడుతున్న ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఆరుగురికి కరోనా సోకింది. దీంతో వెంటనే టోర్నీని రద్దు చేశారు. ఈ విషయంపై షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానల్ లో మాట్లాడారు. ‘బయోసెక్యూర్ పరిస్థితులను కల్పించడంలో పీఎస్బీ పూర్తిగా విఫలమైంది. సరిపడా మెడికల్ సిబ్బంది లేరు. దీనికి పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ బాధ్యత వహించాలని చాలా మంది కోరుతున్నారు. అసలు ఈ వసీమ్ఖాన్ను ఎవరు తీసుకొచ్చారంటూ ఆయన మండిపడ్డారు. పీసీబీ ఛైర్మన్ ఎహ్‌సాన్ మని ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
‘ఆటగాళ్లకు కేటాయించిన హోటళ్లలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఆటగాళ్లు కూడా ఇష్టారాజ్యంగా ఊరంతా తిరుగుతున్నారు. వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్ కూడా జరగలేదు. ఇలా ఉంటే కరోనా రాక ఏం వస్తుంది? మిగతా దేశాల్లో క్రికెట్ టోర్నీలు ఎలా సాగుతున్నాయి. ఆయా దేశాలను చూసైనా పాకిస్థాన్ ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు’ అంటూ ఓ రేంజ్లో విరుచుకు పడ్డారు అక్తర్. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చర్యల వల్ల దేశం పరువు పోయింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ ఎలా తలెత్తు కు తిరుగుతుంది. పాకిస్థాన్ క్రికెటర్ల జీవితాల తో ఆడుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.
అక్తర్ ఆరోపణలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బాధ్యులైన వారి పై చర్యలకు ఉపక్రమించిది. ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన వాళ్లను ఐసోలేషన్‌కు పంపిస్తున్నారు. మిగతా క్రికెటర్లను కూడా క్వారంటైన్‌కు తరలించి కరోనా వ్యాక్సిన్లు ఇస్తున్నారు.