కివీస్ ఓడితే ట్రోలింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారు: సోయబ్ అక్తర్ హాట్ కామెంట్స్

Update: 2021-11-07 10:30 GMT
టీ 20 వరల్డ్ కప్లో ఆసక్తి ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. సీజన్ మొదటి, రెండు మ్యాచులు ఓడిపోయిన టీం ఇండియా ఆ తరువాత జరిగిన వాటిలో విజయం సాధించింది. అయితే ఇప్పుడు సెమీస్ వెళ్లాలంటే మాత్రం ఓ జట్టు ఓడిపోవాలని.. మరో జట్టు గెలవాలని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ 1లో ఉన్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పూర్తయింది. కివీస్ చేతిలోనూ ఇండియా పరాజయం చెందింది. అయితే అప్ఘనిస్తాన్, స్కాట్లాండ్ పై గెలిచింది. తరువాత జరిగిన రెండు మ్యాచుల్లో అద్భుత ఫర్ఫామెన్స్ చేయడంతో టీం ఇండియాకు దారులు దొరికాయి. కానీ అంతిమంగా సెమిస్ కు వెళ్లాలంటే మాత్రం అప్ఘనిస్తాన్ జట్టుపై కివీస్ ఓడిపోవాలి. దీంతో ఇప్పుడు అప్ఘనిస్తాన్ గెలవాలని ఇండియా క్రీడాభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సోయబ్ అక్తర్ సంచలన వ్యాక్యలు చేశారు.

గ్రూప్ -1 లో ఉన్న పాకిస్థాన్ జట్టు ఇప్పటికే సెమిస్ కు చేరింది. ఇప్పుడు రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అప్ఘనిస్తాన్ గెలిస్తేనే భారత్ సెమిస్ కుచేరుతుంది. అలా కాని పక్షంలో కివీస్ గెలిస్తే ఇండియా ఇంటిదారి పట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా అక్తర్ ఈ పరిస్థితిపైకొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ఉంచారు. ‘ఉత్కంఠగా సాగుతున్న టీ 20 లో పాకిస్తాన్ సెమిస్ కు వెళ్లడం శుభ పరిణామం. ఇక అప్ఘనిస్తాన్-కివిస్ మ్యాచులో కివిస్ గెలిస్తే ఏ సమస్య ఉండదు. ఒకవేళ కావాలని కివిస్ ఓడిపోతే మాత్రం పాక్ ఆటగాళ్లు ఊరుకోరు. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకుంటారు.’ అని అన్నారు.

వరల్డ్ కప్ తరువాత భారత్ న్యూజిలాండ్ సిరిసుల్లో పాల్గొననుంది. అయితే పాక్ మాత్రం భద్రతా కారణాల వల్ల ఆ టూర్ ను రద్దు చేసుకుంది. ఈ తరుణంలో కివీస్ కావాలనే ఓడిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోందని, అలా జరిగితే మాత్రం పాక్ ఆటగాళ్లు ఊరుకోరని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే భారత్ కివీస్ చేతిలో ఉండిపోయింది. అప్ఘనిస్తాన్ ను మాత్రం భారత్ ఓడించింది. ఈ తరుణంలో కివీస్ అప్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోతే మాత్రం అనేక అనుమానాలు మొదలవుతాయని అక్తర్ అన్నారు.

ఇదిలా ఉండగా అక్తర్ ఒకరోజు ముందు మరో ఆసక్తి కామెంట్ చేశారు. ఫైనల్లో భారత్, పాక్ మ్యాచ్ చూడాలని ఉందని కోరుకుంటున్నానని తెలిపారు. కానీ తాజాగా ఆయన భారత్ సెమిస్ కు వెళ్లకూడదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా నేడు జరిగే మ్యాచ్ పైనే భారత్ ముందుకెళ్తుందా..? ఇంటిదారి పడుతుందా..? అనేది తేలనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లే కాకుండా దేశంలోని క్రీడాభిమానులు ఇప్పుడు అప్ఘనిస్తాన్ జట్టు గెలవాలని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Tags:    

Similar News