ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ షాక్?

Update: 2021-02-03 12:30 GMT
వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. మరో ఆరు నెలల పాటు ఆయనపై సస్పెన్షన్ ను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
పోలీస్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. అప్పట్లో ఆయన అధికార దుర్వినియోగడానికి పాల్పడ్డారనే కారణంతో జగన్ సర్కార్ ఆయనను సస్పెండ్ చేసింది.  గత ఏడాది ఆగస్టు నుంచి ఏబీ సస్పెన్షన్ మీదే ఉంటున్నారు.

వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉండగా.. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారు. ఆయన వ్యవహారశైలిపై అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందేహాలను వ్యక్తం చేసింది.
చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయి నుంచి నివేదికను తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. వైసీపీ నేతల ఫిర్యాదులు నిజమేనని నిర్ధారించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా తప్పించింది.  ఎన్నికలకు విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

 ఆతర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు హయాంలో ఇజ్రాయెల్ సంస్థ ఆర్.టి. ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ నుంచి నిఘా సామగ్రిని కొనుగోలు చేసే విషయంలో అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు పాటించలేదని.. తన కొడుకు యాజమాన్యంలోని కంపెనీకి కాంట్రాక్టును ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం విచారణ జరిపి ఫిబ్రవరి 8న వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది.
Tags:    

Similar News