తనను విమర్శించిన 20 మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించిన ఎలన్ మస్క్

Update: 2022-11-16 05:49 GMT
ట్విటర్ బాస్ అయ్యాక ఎలన్ మస్క్ దూకుడు పెంచారు. ఉన్నతాధికారులను, సంస్థలోని సగం మందిని తొలగించిన ఈ ప్రపంచ కుబేరుడు ఇప్పుడు తన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గళం వినిపించి ఉద్యోగులను కూడా తొలగించి షాకిచ్చాడు.

ఎలొన్ మస్క్ తన చర్యలను ట్విట్టర్‌లో లేదా అంతర్గత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ స్లాక్‌లో విమర్శించిన ట్విట్టర్‌లోని 20 మంది ఉద్యోగులను తొలగించి షాకిచ్చాడు. కొంతమంది ట్విటర్ ఉద్యోగులు కొత్త సీఈవో అయిన ఎలన్ మస్క్ ని దూషిస్తూ పోస్ట్‌లను రీట్వీట్ చేయడంతో తొలగించాడు. .

దాదాపు 3,800 మంది ఫుల్‌టైమ్ ఉద్యోగులను, 5,000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను తొలగించిన మస్క్ తనను విమర్శించే ధైర్యం చేసే ఎవరినైనా తొలగిస్తానని ఈ హెచ్చరికతో స్పష్టం చేశాడు.

విమర్శించిన  20 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను తొలగించినట్టు హెఆర్ హెడ్ కేసీ న్యూటన్ లిస్ట్ విడుదల చేశారు. మస్క్‌కి వ్యతిరేకంగా అంతర్గతంగా మాట్లాడినందుకు సుమారు 10 మందిని తొలగించారని టెక్ రచయిత గెర్గెలీ ఒరోజ్ ట్వీట్ చేశారు. "విమర్శలు ప్రైవేట్‌గా చేయాలట.. అంతర్గత ఛానెల్‌లో మస్క్ చేసిన ట్వీట్‌ను విమర్శించిన చాలా మంది ఉద్యోగులను గత 24 గంటల్లో తొలగించారని నివేదికలు ఉన్నాయి." అని ఓరోజ్ ట్వీట్ చేశాడు.

మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో బహిరంగంగా విమర్శించిన ట్విట్టర్ ఉద్యోగి ఎరిక్ ఫ్రోన్‌హోఫర్‌ను తొలగించినట్లు మస్క్ ధృవీకరించారు. మస్క్‌పై విమర్శలను రీట్వీట్ చేసిన వారికి కూడా తొలగింపులు తప్పవని ఇదో హెచ్చరిక అని తెలుస్తోంది.

దీనిపై ఓ ట్విటర్ వినియోగదారు కామెంట్స్ చేస్తున్నారు. "ప్రోటోకాల్ ప్రకారం, ట్విట్టర్ -కంపెనీ స్లాక్‌లో మస్కన్ విమర్శించిన అనేక మంది ఉద్యోగులను తొలగించారు" అని దుయ్యబట్టారు.  "ఈ మేధావులను తొలగించినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వారి అపారమైన ప్రతిభ మరెక్కడైనా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు". అంటూ తొలగింపులను ఎద్దేవా చేస్తూ మస్క్ కౌంటర్ ఇచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News