యుద్దం వేళ రష్యన్లు ఎక్కువగా కొంటోంది తెలిస్తే షాకే

Update: 2022-03-21 05:30 GMT
ఊహించని సిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలస్తోంది రష్యా చేస్తున్న యుద్ధం. తాను చెప్పినట్లుగా వినని ఉక్రెయిన్ కు బుద్ధి చెప్పి.. తానేమిటో చెప్పాలనుకుంటున్న రష్యాకు ఈ యుద్ధంలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

యుద్ధం మొదలైనంతనే ఉక్రెయిన్ తమ వశం అవుతుందన్న రష్యా అంచనాలకు భిన్నంగా నాలుగో వారంలోకి యుద్ధం అడుగు పెట్టింది. ఈ యుద్ధాన్ని.. రష్యా తీరును తీవ్రంగా తప్పు పడుతున్న పశ్చిమ దేశాలు.. ఆ దేశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. ఆంక్షల కత్తిని తిప్పటంతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇప్పటికే క్రెడిట్.. డెబిట్ కార్డులు పని చేయకపోవటం.. పలు కార్ల కంపెనీలు తమ కార్ల నిర్వహణను నిలిపివేయటంతో పాటు.. యాపిల్ లాంటి సంస్థలు తమ సర్వీసుల్ని బంద్ చేస్తే.. మెక్ డోనాల్డ్.. బర్గర్ కింగ్ లాంటి చైన్ ఫుడ్ సెంటర్లు సైతం తమ దుకాణాల్ని రష్యాలో మూసేశారు.

యుద్ధం కారణంగా రష్యా కరెన్సీ రూబుల్ విలువ అంతకంతకూ పడిపోతోంది. దీంతో.. ధరలు భారీగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. రష్యాలో భారీగా అమ్మకాలు సాగుతున్నదేమిటో తెలుసా.. కండోమ్ లు.

నిజమే.. మీరు చదువుతున్నది కరెక్టే. కండోమ్ అమ్మకాలు సాధారణం కంటే కూడా 170 రెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం.. రానున్నరోజుల్లో కండోమ్ ధరలు భారీగా పెరిగిపోతాయని.. విదేశాల నుంచి దిగుమతి కావాల్సిన కండోమ్ లు రావటం ఆగిపోతాయని..

దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయాందోళనలు ఎక్కువ అయ్యాయి. దీంతో..రష్యన్లు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున కండోమ్ లను కొనుగోలు చేస్తున్నారట. దీంతో.. వీటి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.
Tags:    

Similar News