అన్న ముఖేష్ అంబానీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడు.. ఇక ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్నాడు. తమ్ముడు అనిల్ అంబానీయేమో వ్యాపారాలు సరిగా చేయలేక అప్పుల పాలై దివాళా తీశాడు. తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్నాడు. తాజాగా అనిల్ అంబానీకి గట్టి షాక్ తగిలింది.
రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్ క్యాప్) బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. బకాయిల ఎగవేతలు, తీవ్రమైన గవర్నెన్స్ సమస్యల నేపథ్యంలో త్వరలోనే కంపెనీ దివాలా ప్రక్రియ చేపట్టనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొని గట్టి షాక్ ఇచ్చింది.
ఈమేరకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఈడీ నాగేశ్వరరావును సంస్థ అడ్మినిస్ట్రేటర్ గా నియమించినట్లు వివరించింది. కంపెనీకి దివాలా పరిష్కార నిపుణుడిని నియమించాలని జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యూనల్ ముంబై బెంచ్ కు త్వరలోనే దరఖాస్తు సమర్పించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
మరోవైపు, దివాలా చట్టం కింద రుణసమస్యను పరిష్కరించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆర్ క్యాప్ తెలిపింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్ క్యాప్ రుణభారం సెప్టెంబర్ ఆఖరు నాటికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.40000 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ రూ.6001 కోట్ల ఆదాయంపై రూ.1156 కోట్ల నష్టం ప్రకటించింది.
దివాలా స్మృతి చట్టం ప్రకారంగా కంపెనీ రుణాన్ని పరిష్కరించే దిశగా ఆర్బీఐ ప్రారంభించిన చర్యలను రిలయన్స్ క్యాపిటల్ స్వాగతించింది. వాటాదారుల ప్రయోజనార్థం త్వరతిగతిన రునాల పరిష్కారం కోసం ఆర్బీఐ నియమిత అడ్మినిస్ట్రేటర్ కు పూర్తిగా సహకరించినున్నట్లు కంపెనీ పేర్కొంది.
రిలయన్స్ క్యాపిటల్స్ ప్రస్తుత రుణ భారం రూ.40000 కోట్లు ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన వాటాదారుల వార్షిక సాధారణ సమావేశం (ఏజీఏం)లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం రుణభారంలో కంపెనీ డిబెంచర్ హోల్డర్లకు చెల్లించాల్సిన వాటాయే 95శాతంగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి గాను ఈ ఎన్.బీ.ఎఫ్.సీ రూ.1156 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2021-21 మొత్తానికి కంపెనీ నష్టం 9287 కోట్లుగా నమోదైంది.
ఇలా అనిల్ అంబానీ కంపెనీ దివాలా తీయడంతో ఆర్బీఐ పరిష్కార చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే డీహెచ్ఎఫ్ఎల్ పైనా చర్యలు చేపట్టింది.