బీఆర్ఎస్ పార్టీకి షాక్.. ఆదిలోనే అడ్డంకులు

Update: 2022-12-08 04:18 GMT
అనుకున్నట్టే అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్రసమితిగా మార్చి కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్మాయంగా ఎదగాలనుకుంటున్న కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లేలా ఈసీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం గేమ్ లో భాగంగానే ఇలా చేస్తోందని తెలుస్తోంది.

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ రిజిస్ట్రేషన్ కోసం పార్టీ అధినేత కేసీఆర్ ఈసీకి దరఖాస్తు చేసుకోగా తాజాగా దీనిపై ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

వరంగల్ జిల్లాకుచెందిన బానోతు ప్రేమ్ నాయక్ తాను పెట్టబోయే పార్టీకి 'బీఆర్ఎస్' పేరును ఖరారుచేయాలని కోరుతూ 3 నెలల క్రితం ఈసీని కోరారు. తన తర్వాతే టీఆర్ఎస్ పార్టీ పేరు 'బీఆర్ఎస్'గా మార్చుకుందని ఈనెల 6న ప్రేమ్ నాయక్ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

కేసీఆర్ ను తొక్కేయడానికి ఆది నుంచి ప్రయత్నిస్తున్న బీజేపీ ఈక్రమంలోనే ఈ వరంగల్ జిల్లా వాసితో ఫిర్యాదు చేయించిందని.. ఇతడి ద్వారా బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్ కు రాకుండా స్కెచ్ గీసిందని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును  భారత్ రాష్ట్ర సమితి('బీఆర్ఎస్)గా  మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తెలుగువారితోపాటు హిందీలోనూ సులభంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో భారత్ రాష్ట్ర సమితి పేరు ఎంపిక చేశారు. టీఆర్ఎస్ లో తెలంగాణ బొమ్మ అందులోని 33 జిల్లాలు పార్టీ జెండాలో కనిపిస్తే.. బీఆర్ఎస్ లో భారతదేశ పటంను ముద్రించారు. కేవలం తెలంగాణ ప్లేసులో భారత్ వచ్చి చేరింది.

ఇక టీఆర్ఎస్ పేరు మార్చుతూ భారత రాష్ట్ర సమితిగా ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి  కేకే పంపారు.  దీనిపై అభ్యంతరాలపై గడువు విధిస్తూ నోటిఫికేషన్ జారీచేయగా.. వరంగల్ వాసీ తన అభ్యంతరం తెలుపుతూ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ ఏం చేస్తుందన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News