టెన్నిస్ అభిమానులకు సానియా మీర్జా షాకిచ్చింది. ఇండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకుంది. టెన్నిస్ నుంచి రిటైర్ కానున్నట్టు తెలిపింది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది సానియా..
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ విషయాన్ని వెల్లడించింది.
సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ లో ఓడిపోయారు. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్ సెక్-కాజా జువాన్ జోడి చేతిలో వరుస సెట్లలో ఓడిపోయారు.
సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ తో కలిసి ఈ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ లో పాల్గొంటోంది. ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నాను. నేను మొత్తం ఈ సీజన్ లో ఆడగలనో లేదో తెలియదు..కానీ నేను మొత్తం సీజన్ లో ఉండాలనుకుంటున్నాను’ అని సానియా ప్రకటించింది.
సానియా 2013లోనే సింగిల్స్ ఆడడం మానేసింది. అప్పటి నుంచి ఆమె డబుల్స్ మాత్రమే ఆడుతోంది. సింగిల్స్ లో ఆడుతున్నప్పుడు కూడా సానియా చాలా విజయాలు సాధించింది. ఆమె చాలా మంది పెద్ద టెన్నిస్ క్రీడాకారులను ఓడించి 27వ ర్యాకు చేరుకుంది. ఇండియన్ టెన్నిస్ లో సంచలనం సృష్టించిన సానియా డబుల్స్ లో ప్రపంచ నంబర్ 1కు చేరింది.దాదాపు 14 పతకాలు సాధించింది. అందులో 6 బంగారు పతకాలు సాధించారు. ప్రస్తుతం రిటైర్ మెంట్ ప్రకటించారు.