ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది చాలా వేగంగా జరుగుతుంది. అయితే , ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ల వాడకాన్ని కెనడా తాత్కాలికంగా నిలిపేసింది. 55 ఏళ్లలోపు వయసున్న వ్యక్తులెవరికీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వరాదని రోగనిరోధకతపై జాతీయ సలహా కమిటీ (ఎన్ ఏ సీఐ) సిఫార్సు చేయడంతో కెనడా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఆస్ట్రాజెనెకా టీకాలు వేసుకున్నవారిలో ప్రతికూలతలు ఏర్పడుతున్నాయని, వాటిని పరిశోధించి, పరిష్కరించేంత వరకు 55 ఏళ్లలోపు వారికి సదరు టీకాలను ఇవ్వరాదని ఎన్ ఏ సీఐ పేర్కొంది. అయితే, 55 ఏళ్లు పైబడినవారిలో ఆస్ట్రాజెనెకా వల్ల ప్రతికూల లక్షణాలేవీ లేవు కాబట్టి టీకా ఇవ్వచ్చు అని తెలిపారు.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకంపై యూరప్ దేశాల్లో అనుమానాలు మొదలైయ్యాయి, ఈ టీకాను తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతోందని, అలా ఆస్ట్రియాకు చెందిన ఓ నర్సు ప్రాణాలు కోల్పోయిందని వార్తలు రావడంతో పలు దేశాలు ఆస్ట్రాజెనెకా వాడకాన్ని తాత్కాలికంగా నిలిపేశాయి. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగి, వ్యాక్సిన్ల సేఫ్టీపై భరోసా ఇవ్వడంతో మళ్లీ టీకా ఇవ్వడం ప్రారంభించారు. ఇక అనుమానాలన్నీ తొలగి పోయాయి అనుకున్న సమయంలో కెనడాలో ఆస్ట్రాజెనెకా, అది కూడా 55 ఏళ్లలోపు వారికి నిలిపేయడంతో మరో కొత్త చర్చ ప్రారంభం అయింది.
వ్యాక్సిన్ ద్వారా బలహీనపడ్డ లేదా మృత వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇవి మానవ శరీరంలోని తెల్లరక్తకణాలు ప్రేరేపితం చేసి, వ్యాధిపై పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ ప్రక్రియలో రక్తంలోని ప్లేట్ లెట్స్ ప్రభావానికి గురై, ప్లేట్ లెట్స్ సంఖ్య సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడం, తద్వారా రక్తం గడ్డకడుతోండటాన్ని గుర్తించామని నిపుణులు చెప్పడంతో 55 ఏళ్లలోపు వ్యక్తులకు ఆస్ట్రాజెనెకా టీకాలు వేయొద్దని సూచించామని కమిటీ పేర్కొంది. కెనడాలో 55ఏళ్ల లోపు వారికి ఆస్ట్రాజెనెకా టీకాల పంపిణీ నిలిపివేత తాత్కాలికమే అంటోన్న అధికారులు, త్వరలోనే తదుపరి ఆదేశాలిస్తామని చెప్తున్నారు. భారత్ కు సంబంధించి ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ సంస్థలు సీరం ఫార్మాతో కలిసి ‘కొవిషీల్డ్' పేరుతో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చాయి. కొవిషీల్డ్ తో పాటు భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ ను కేంద్రం అత్యవసర వినియోగానికి వాడుతుంది.