బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి కేటీయార్ ఫుల్లుగా ఫైరైపోయారు. తాజా వ్యాఖ్యలతో నడ్డా పెద్దమనిషి కాదని తేలిపోయిందని మంత్రన్నారు. ఇంతకీ సమస్య ఏమిటంటే హైదరాబాద్ కు వచ్చిన నడ్డా తమ ప్రభుత్వాన్ని పడగొడతీమని, కేసీయార్ పిచ్చోడని చేసిన వ్యాఖ్యలపై కేటీయార్ బాగా సీరియస్ అయిపోయారు. మరి తన తండ్రిని పట్టుకుని నడ్డా పిచ్చోడని అంటే కేటీయార్ ఊరుకుంటారా ?
కేసీయార్ పిచ్చోడు కాదని నడ్డాయే పిచ్చోడన్నారు. బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ చిన్న పిచ్చోడైతే జాతీయ అద్యక్షుడు నడ్డాయే పెద్ద పిచ్చోడన్నారు. దీక్షను పోలుసులు భగ్నం చేసినపుడు బండి తన గుండును నేలపైన వేసి కొట్టుకున్న విషయాన్ని కేటీయార్ ప్రస్తావించారు. అందుకనే ఇద్దరినీ కలిపి పిచ్చోళ్ళని ముద్రవేసేశారు. తెలంగాణాలో కుటుంబపాలన నడుస్తోందని నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు.
తాము కేసీయార్ కుటుంబసభ్యులుగా పదవుల్లోకి రాలేదని, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళుగా పదవులు అందుకున్నట్లు చెప్పారు. తమపైన కుటుంబపాలన అని ముద్రవేస్తున్న నడ్డా మరి బీజేపీలో జరుగుతున్నదేమిటి ? అంటు ఎదురు ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు జయంత్ షాకు బీసీసీఐ పదవి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. నడ్డా అత్త జయశ్రీ బెనర్జీకి మంత్రి పదవి ఎలా వచ్చిందో చెప్పాలని కేటీయార్ డిమాండ్ చేశారు.
ఊరికే నోటికేదొస్తే అది మాట్లాడేయటం కాదని కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ భగీరధను నీతి అయోగ్ మెచ్చుకున్న విషయం కూడా నడ్దాకు తెలీదా అని ప్రశ్నించారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీ పార్టీని అధికారంలోకి తెచ్చింది వాస్తవం కాదా అంటు నడ్డా సమాధానం చెప్పాలన్నారు. మొత్తంమీద నడ్దా వ్యాఖ్యలకు కేటీయార్ గట్టి సమాధానమే చెప్పారు. హోలు మొత్తంమీద గమనించాల్సిందేమంటే నడ్డా వచ్చింది అగ్గికి ఆజ్యం పోయటానికే అని అర్ధమైపోతోంది.
కేసీయార్ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయటమే టార్గెట్ గా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే రోజుకో ఉద్యమం పేరుతో నానా గోల చేస్తున్నారు. వీళ్ళ దెబ్బకు కేసీయార్ కు చికాకుగా ఉన్నదైతే వాస్తవమే. కానీ ధైర్యంగా ఏమీ యాక్షన్ తీసుకోలేని పరిస్దితి. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉన్నదాన్న ఏకైక కారణంతోనే తెలంగాణాలో బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. పైగా స్వయంగా బండి సంజయే కరీంనగర్ ఎంపీ కావటంతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు.