మేనత్త పదానికి మచ్చ తెచ్చేసింది.. ఆమె చేసిన పని తెలిస్తే షాకే

Update: 2021-12-03 02:00 GMT
షాకింగ్ క్రైం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. విన్నంతనే ఉలిక్కిపడే ఈ నేరం గురించి వింటే.. నోట మాట రాదంతే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం పోలీసు వర్గాలకు సైతం షాకింగ్ గా మారింది. 14 ఏళ్ల బాలుడితో మేనత్త వరసయ్యే మహిళ చేసిన పని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

తొమ్మిదో తరగతి చదువుకున్న కుర్రాడ్ని మాయ మాటలు చెప్పి లొంగదీసుకొని.. లైంగిక వాంఛలు తీర్చుకున్న వైనం ఒక ఎత్తు అయితే.. ఆ తతంగాన్ని వీడియో తీసి.. తాను అడిగినంత డబ్బులు తీసుకురాకపోతే.. దాన్ని బయటపెడతానంటూ బ్లాక్ మొయిల్ చేసి.. దొంగతనం చేయించిన ఈ ఉదంతంలోకి వెళితే..
నగరంలోని వేరే ప్రాంతం నుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 10లోని గాయత్రీ హిల్స్ లోకి మారిందో కుటుంబం.

అల్మారాలో ఉండాల్సిన బంగారు నగల్లో తేడా వచ్చింది. దాదాపు 200 గ్రాముల బంగారం మిస్ కావటంతో కొడుకును ప్రశ్నించింది. మొదట్లో మాట దాటేసే ప్రయత్నం చేసినా.. గట్టిగా అడగటంతోఅసలు విషయాన్ని వెల్లడించాడు. తనకు మేనత్త వరుసయ్యే మహిళ తాను చదువుతున్న స్కూల్ వద్దకు వచ్చి.. తనను బయటకు తీసుకెళ్లేదని చెప్పాడు.

తన మాజీ భర్తతో కలిసి వచ్చే మేనత్త.. కుర్రాడికి మాయమాటలు చెప్పి చార్మినార్ దగ్గరున్న ఒక లాడ్జికి తీసుకెళ్లి తన లైంగిక వాంఛను తీర్చుకుంది. ఈ క్రమంలో వీడియో తీసింది. దీన్నిబయటపెడతానని.. అలా కాకూడదంటే తాను కోరినట్లుగా బంగారం.. డబ్బులు తెచ్చి ఇవ్వాలని బ్లాక్ మొయిల్ చేయసాగింది.
దీంతో మూడు దశల్లో 200 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.6 లక్షల మొత్తాన్ని దొంగతనం చేసినట్లుగా తల్లికి చెప్పాడు.

దీంతో షాక్ తిన్న ఆమె.. జరిగిన ఉదంతం గురించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితురాలితో పాటు ఆమె మాజీ భర్తపై ఐపీసీ సెక్షన్ 384తో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పద్నాలుగేళ్ల చిన్న కుర్రాడిని ట్రాప్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News