డ్రాగన్ చేసిన నిర్లక్ష్యం.. ప్రపంచానికే ఎసరు పెట్టింది.. వెల్లడైన కొత్త నిజం

Update: 2021-03-21 01:30 GMT
ఒక వ్యక్తి నిర్లక్ష్యంతో చోటు చేసుకునే నష్టం భారీగా ఉంటుంది. అలాంటిది ఒక దేశం చేసిన నిర్లక్ష్యం యావత్ ప్రపంచానికి శిక్ష వేసేలా మారింది. తెలియక పొరపాటు చేస్తే అదెంతదైనా సర్లే అని సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఒక దేశం నిర్లక్ష్యంగా వ్యవహరించటం.. బాధ్యతల్ని మర్చిపోవటం ప్రపంచ దేశాలకు పరీక్షగా మారటమే కాదు.. అందుకు లక్షలాది మంది ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి రావటం దేనికి నిదర్శనం?

కరోనా పుట్టిల్లు వూహాన్ అన్నది పాత విషయమే అయినప్పటికీ.. తాజాగా ప్రఖ్యాత సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఒక వ్యాసం కొత్త విషయాల్ని వెల్లడించింది. తొలి కరోనాకేసు వెలుగు చూడటానికి రెండు నెలల ముందే చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని.. వాటిని గుర్తించటంలో ఆలస్యం జరిగిందన్న విషయాన్ని గుర్తించారు. 2019 అక్టోబరు నాటికే వైరస్ పై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చేసిన పరిశోధన గురించిన వివరాల్ని ఇందులో పేర్కొన్నారు.

ఈ పరిశోధనకు కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత శాన్ డియోగో వర్సిటీ నేతృత్వం వహించింది. దీని పరిశోధన ప్రకారం.. కోవిడ్ బారిన పడిన వారు 2019 నవంబరు నాలుగు వరకుసగటున ఒకటి కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. 2019 డిసెంబరు ఒకటి నాటికి వీటి సంఖ్య కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయట. అయితే.. దీని తీవ్రత గుర్తించే విషయంలో జరిగిన పొరపాట్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. విదేశాలను హెచ్చరించే విషయంలో దొర్లిన తప్పులు.. మొత్తం ప్రపంచం శిక్ష అనుభవించేలా చేసింది.
Tags:    

Similar News