ఇండియాలో ఏజ్ 20 ఉంటే.. కొరియాలో 21 అంట‌.. ఇలాగ అంట‌!

Update: 2021-03-02 05:30 GMT
ఇండియాలో రెండు, రెండు క‌లిపితే నాలుగు (2+2=4) అవుతుంది. ఆ మాట‌కొస్తే.. ఇండియాలో ఏంటీ.. ప్ర‌పంచంలో మొత్తంలో ఇదే లెక్క క‌దా..?! కానీ.. కొరియాలో మాత్రం రెండు, రెండు ఐదు అవుతుంది! అవును.. మ‌నిషి వ‌య‌సు విష‌యంలో కొరియా లెక్క‌లు ఇలాగే ఉన్నాయి!

ప్ర‌పంచం మొత్తం ఓ లెక్క‌ను ఫాలో అవుతుంటే.. కొరియ‌న్లు మాత్రం ఓ డిఫ‌రెంట్ లెక్క‌ను అనుసరిస్తున్నారు. ఆ ఈక్వేష‌న్ ప్ర‌కారం.. మీరు కొరియా వెళ్లారంటే, ఇప్పుడున్న వ‌య‌సుకు వెంట‌నే ఒక సంవ‌త్స‌రం క‌లిసి, మ‌రింత పెద్ద‌వారు అయిపోతారు! మ‌రి, ఈ కొరియ‌న్ల‌ ఏజ్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా?

మీ వ‌య‌సు ఎంత అంటే.. ఎవ‌రైనా ఎక్క‌న్నుంచి లెక్కిస్తారు? పుట్టిన రోజు నుంచి మొదలు పెట్టి.. ఇప్పటి వరకు లెక్కించి వయసు చెప్తారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఏజ్ ను ఇలాగే కౌంట్ చేస్తారు. కానీ.. కొరియన్ల లెక్క వేరుగా ఉంటుంది! మ‌న ద‌గ్గ‌ర బిడ్డ‌కు ఏడాది వ‌య‌సు రావాలంటే.. పుట్టిన రోజు మొద‌లుకొని 365 రోజులు గడిచిపోవాలి.. అంటే 12 నెలలు పూర్తవ్వాలి. కానీ.. కొరియాలో మాత్రం బిడ్డ పుట్టిన రోజే రెండో సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టిన‌ట్టు లెక్క‌!

ఇంకా క్లియ‌ర్ గా చెప్పాలంటే.. మ‌నం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన రోజునుంచి బిడ్డ వ‌య‌సు లెక్కిస్తాం. కానీ.. కొరియాలో మాత్రం.. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వయస్సును లెక్కిస్తారు. అంటే.. తల్లి కడుపులో ఉండే 9 నెలలను వారు ఏడాదిగా భావిస్తారు. 12 నెలలు పూర్తికాకపోయినప్ప‌టికీ.. అదొక సంవ‌త్స‌రంగా న‌మోదు చేస్తారు.

బిడ్డ పుట్టిన తర్వాతి రోజునే బిడ్డకు రెండో ఏడాది మొదలైనట్లు లెక్కిస్తారు. అంటే.. అక్కడి పిల్లలకు మొద‌టి పుట్టిన‌రోజు ప్రసవం రోజునే జరిగిపోతుందన్న‌మాట‌! ఇప్ప‌టి వ‌ర‌కూ.. ఎక్క‌డా క‌నీవినీ ఎరుగ‌ని ఈ వ‌య‌సు లెక్క భ‌లేగా ఉంది క‌దూ!
Tags:    

Similar News