వివేకాను చంపింది వీరే.. బయటపడ్డ షాకింగ్ నిజాలు

Update: 2021-11-14 03:16 GMT
మాజీ మంత్రి వివేకా హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఏళ్ల తరబడి ఈ కేసుపై విచారణ జరుగుతున్నా ఇంకా ఓ కొలిక్కిరాలేదు. కేసు విచారణను త్వరగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని వివేకా కుమార్తె సునితా అధికారులను కోరుతున్నారు. అయితే ఈ కేసులు వివేకా కారు డ్రైవర్ దస్తగిరి సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. హత్య జరిగిన తీరును వెల్లడించారు. ఆ వివరాలను పూస గుచ్చినట్లు వివరించారు. వివేకాను హత్య కోసం నిందితుల కుదుర్చుకున్న డీల్.. అందుకోసం తీసుకున్న సుపారి ఇలా అనేక విషయాలను దస్తగిరి పోలీసులకిచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ లో వివరించారు. అసలు హత్య ఎందుకు జరిగింది? ఎవరు చేయించారు? ఈ హత్యకు కారణాలేమిటి? ఎలా చేశారు? హత్య కోసం ఎన్ని కోట్లు సుపారీ ఇచ్చారు.. ఇలా అనేక విషయాలు కన్ఫెషన్ స్టేట్‌ మెంట్ దస్తగిరి వెల్లడించారు.

వివేకానందరెడ్డి హత్యపై దస్తగిరి ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌ మెంట్ ఇచ్చారు. అయితే ఆలస్యంగా స్టేట్ మెంట్ వెలుగులోకి వచ్చింది. ఈ కన్ఫెషన్ స్టేట్‌ మెంట్‌ ను నిందితులకు న్యాయవాదులకు కోర్టు ఇచ్చింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ప్రస్తావించారు. వివేకా హత్యలో నలుగురు పాల్గొన్నట్లు దస్తగిరి పేర్కొన్నారు. సీఆర్ పీసీ సెక్షన్ 164 (1) కింద ప్రొద్దుటూరు కోర్టు స్టేట్ మెంట్ రికార్డు చేసింది. ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్ కలిసి వివేకాను హత్య చేసినట్లు దస్తగిరి తెలిపారు. ఈ హత్యకు ఎర్ర గంగిరెడ్డి పథకం పన్నారని వెల్లడించారు. బెంగళూరు భూ వివాదంలో వాటా ఇవ్వకపోవడంతో  వివేకాపై గంగిరెడ్డి కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మోసం చేశారని మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, ఎంపీ అవినాష్‌లకు వివేకా హెచ్చరించారని కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లో వెల్లడించారు. ఎన్నికల ముగిసిన తర్వాత  అవినాష్‌ ఇంటి దగ్గర వాదులాడుకున్నారని దస్తగిరి తెలిపారు. ఆ సమయంలో తనను కావాలనే ఓడించారని, మీ కథ చూస్తానంటు అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చారని కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. వివేకాను హత్య చేయడానికి రూ. 40 కోట్లు సుపారి ఇచ్చారని తెలిపారు. తనకు రూ. 5 కోట్లు ఇస్తామని, కోటి రూపాయలు ముందుగా ఇచ్చారని, తనకు ఇచ్చిన మొత్తంలో రూ. 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని దస్తగిరి చెప్పారు.

కోటి రూపాయాల్లో 75 లక్షలు తన స్నేహితుడు మున్నా దగ్గర దాచానని వివరించారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి పేర్కొన్నారు. తమను చూసిన వివేకా ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని తెలిపారు. తర్వాత వివేకా బెడ్‌రూమ్‌లోకి వెళ్లడంతో అతని వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని తెలిపారు. వివేకా బెడ్‌రూమ్‌లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకా మొహంపై సునీల్ యాదవ్ దాడిచేసినట్టు స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడిచేశాడని వెంటనే వివేకా కింద పడిపోవడంతో అతని ఛాతిపై 7, 8 సార్లు సునీల్ బలంగా కొట్టినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌ మెంట్ వివరించారు.
Tags:    

Similar News