హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బెడ్ షీట్ తో కిటికీకి ఉరేసుకోవడం.. సూసైడ్ నోట్ లో ఆత్మహత్యకు కారణాలు రాయకపోవడంపై మౌనిక మృతి పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మౌనిక మృతి చూడటానికి ఆత్మహత్యలా కనిపిస్తున్నా, అసలు కారణాలు ఏంటన్న దానిపై స్పష్టత లేదు. దీంతో మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మౌనిక మృతి కేసులో అనుమానాలు రేకెత్తిస్తోన్న వాటిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఒకవేళ నిజంగానే మౌనిక ఆత్మహత్య చేసుకుంటే.. దానికి గల కారణాలను సూసైడ్ నోట్‌లో ఎందుకు రాయలేదన్న దానిపై లోతుగా దర్యాప్తు చేశారు.
ఆర్.మౌనిక గత నెల 22న ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏంటనే విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. హాస్టల్ లోని ఆమె గదిలోంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన పోలీసులకు, ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు వెల్లడైయ్యాయి. ఆమె సెల్ ఫోన్ నుంచి బట్టబయలైన పర్సనల్ చాటింగ్ తో పాటు పలువురు సన్నిహిత స్నేహితులను విచారించిన పోలీసులు. మౌనిక ఆత్మహత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో మృతురాలి తల్లిదండ్రులతో నిర్ధారించుకున్న తర్వాత, పూర్తి వివరాలను మీడియాకు వివరిస్తామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కూతురు మౌనిక. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తోంది. నానో టెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్న మౌనిక, క్యాంపస్ లోనే విమెన్స్ హాస్టల్-7లో ఉంటోంది. రోజూ అందరి కంటే ముందే వచ్చే ఆమె రాకపోవడంతో, తోటి విద్యార్థులు వెళ్లి పిలిచారు. రూమ్ లో నుంచి స్పందన లేకపోవడంతో, కంగారుపడ్డ తోటి విద్యార్థినులు వెంటిలేటర్ లోంచి చూశారు. కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించిందీ మౌనిక. మౌనిక ఆత్మహత్య ఇతర విద్యార్థులందర్నీ తీవ్ర విషాదంలో ముంచేసింది. కరోనా వ్యాప్తి తగ్గడంతో, ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి ఈ మధ్యే అనుమతించారు. ఈనెల 18న హాస్టల్ గదికి వచ్చి ఉంటోంది మౌనిక. ఆమె తండ్రి లచ్చయ్య ఊళ్లో వ్యవసాయం చేస్తున్నారు. పదో తరగతి వరకు ఊళ్లోని గవర్నమెంట్ స్కూల్లో చదివిన మౌనిక, ఆ తర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించింది. అక్కడ ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని హెచ్ సీయూ లో ఎంటెక్ చదువుతోంది. ఇతరులకు ధైర్యం చెప్పే తమ కూతురు.. ఆత్మహత్య చేసుకుందంటే ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు మౌనిక తండ్రి లచ్చయ్య. క్యాంపస్‌లోనే ఏదో జరిగిందని తండ్రి లచ్చయ్య అనుమానం వ్యక్తం చేశారు.