కమీషన్ డబ్బులకు కక్కుర్తిపడితే మాచవరపు సుధాకర్ పరిస్ధితి లాగే తయారవుతుందా ? అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం చూస్తే అవుననే అనిపిస్తోంది. మూడురోజులుగా దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న వేలాది కోట్ల రూపాయల హెరాయిన్ పట్టివేత అంశంలో సుధాకర్ కేవలం కమీషన్ డబ్బులకు కక్కుర్తిపడినట్లు దర్యాప్తు అధికారులు దాదాపు ఓ అంచనాకు వచ్చారు. ఈ కేసును డైరెక్టరేట్ ఆప్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.
మూడు రోజులుగా సుధాకర్ దంపతులను విచారిస్తున్న డీఆర్ఐ అధికారులు కేవలం కమీషన్ డబ్బుల కోసమే తన సంస్ధకు చెందిన ఐఈసీ లైసెన్సు వివరాలను డ్రగ్ మాఫియాకు అందించినట్లు అనుమానిస్తున్నారు. ఐఈసీ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ కోడ్ అన్నమాట. విదేశాలనుండి ఏ సరుకును తెప్పించుకోవాలన్నా ఐఈసీ లైసెన్స్ ఉండితీరాల్సిందే. పట్టుబడిన హెరాయిన్ విలువను డీఆర్ఐ అధికారులు సుమారు రు. 21 వేల కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు.
మొదట్లో హెరాయిన్ విలువ రు. 9 వేల కోట్లని అంచనా వేసిన ఉన్నతాధికారులు తాజాగా రు. 21 వేల కోట్లుంటుందని తేల్చారు. ముందు ముందు ఈ విలువను మరింత పెంచుతారేమో తెలీదు. సుధాకర్ నేపధ్యాన్ని చూస్తే చెన్నైలోని శివారు ప్రాంతాల్లో ఓ మామూలు అపార్ట్ మెంట్లో ఉంటున్నాడట. ఆయన లైఫ్ స్టైల్ కూడా చాలా సాధరణంగా ఉంటుందని ఆయన నివసించే అపార్టుమెంట్లో నివసిస్తున్న ఇతర ఓనర్లు చెప్పారని సమాచారం.
సుధాకర్ సోదరుడు తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో ఆటో నడుపుకుంటున్నారట. సుధాకర్ కు ఒకపుడు కారుండేది కానీ ఇపుడు లేదని ఇతర ఓనర్లు దర్యాప్తు అధికారులకు చెప్పారట. అంటే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే సుధాకర్ బిజినెస్ చేయటంలేదని తెలుస్తోంది. కాకపోతే డ్రగ్స్ మాఫియాతో చేతులుకలిపి తన ఐఈఎల్ లైసెన్సు వివరాలు అందిచారు.
సంవత్సరాల తరబడి పోర్టు, ఇంపోర్ట్స్ ఎక్స్ పోర్ట్స్ బిజినెస్ లో పనిచేస్తున్న సుధాకర్ కు తన ఐఈఎల్ లైసెన్సు వివరాలను ఇతరులకు ఇవ్వకూడదని, ఇస్తే దేనికి ఉపయోగించుకుంటారో తెలీకుండానే ఉంటుందా ? తెలిసీ డ్రగ్స్ మాఫియాకు తన లైసెన్స్ కోడ్ వివరాలను సుధాకర్ ఇచ్చాడని డీఆర్ఐ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అంటే కమీషన్ కక్కుర్తే ఇపుడు సుధాకర్ కొంప ముంచేసిందన్నది స్పష్టంగా అర్ధమవుతున్నది. ముందు ముందు మరెన్ని సంచలన వివరాలు బయటకొస్తాయో చూడాల్సిందే.