సికింద్రాబాద్ లో షాకింగ్ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

Update: 2022-03-23 04:20 GMT
దారుణ విషాదం హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ బోయిగూడలోని ఒక టింబర్.. తక్కు గోదాంలో చెలరేగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మొత్తం 15 మంది కార్మికులు చిక్కుకోగా.. 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో చోటు చేసుకున్న ఈ దారుణ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది.

బోయగూడలోని ఐడీహెచ్ కాలనీలో స్క్రాప్ దుకాణంలో 15 మంది కార్మికులు ఎప్పటిలానే అక్కడే నిద్ర పోయారు. తెల్లవారుజామున షార్ట్ సర్క్యుట్ జరగటంతో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

మిగిలిన 11 మంది సజీవ దహనం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ లభించాల్సి ఉంది. తుక్కు షాపు కావటం.. బయటకు వచ్చేందుకు ఒకటే దారి ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి.

మంటలు త్వరగా వ్యాపించే స్వభావం ఉన్న వస్తువుల కారణంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి. ప్రమాదంలో మరణించిన వారంతా బిహార్ కు చెందిన వారిగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికే ఫైరింజన్లకు సమాచారం అందించారు.

మొత్తం 8 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం మరణించిన వారి పేర్ల వివరాలు..

1. బిట్టు
2. సికిందర్‌
3. దినేష్‌
4. దామోదర్,
5. చింటు
6. సికిందర్‌
7. రాజేష్‌
8. రాజు
9. దీపక్‌
10.పంకజ్‌. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. గల్లంతైన మరో ఇద్దరి వివరాలు కూడా బయటకు రాలేదు.
Tags:    

Similar News