సింధియా బాటలో శశిథరూర్. కాంగ్రెస్ కీలక నేతలంతా కాంగ్రెస్ ను వీడే పనిలో ఉన్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కూడా త్వరలోనే కాంగ్రెస్ ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వ్యతిరేక గాలిలోనూ శశిథరూర్ ఎంపీగా గెలిచారు. అంతటి ఉద్దండ నేత కూడా ఇప్పుడు కేరళ లో బీజేపీకి పెద్ద దిక్కుగా మారబోతున్నారని.. త్వరలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరబోతున్నారని టాక్.
కేరళలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు అక్కడ బలమైన నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను దెబ్బతీసి బీజేపీ బలపడాలంటే శశిథరూర్ ను లాగాలని చూస్తోంది.
ఇక కాంగ్రెస్ కోలుకుంటుందన్న ఆశ ఆ పార్టీ సీనియర్లలో సందేహంగా మారింది. పైగా శశిథరూర్ మెడకు ఆయన భార్య అనుమానాస్పద మృతి కేసు వేలాడుతోంది. అందుకే శశి బీజేపీలో చేరడం ఖాయమంటున్నారు.
తాజాగా సింధియా బాటలోనే శశిథరూర్ కూడా అవసరార్థం బీజేపీలో చేరబోతున్నారని కేరళ నుంచి వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ మరింత కృంగిపోవడం ఖాయం.