చేయని తప్పుకు 30 ఏళ్ల శిక్ష..తాజాగా బయటపడిన నిజం.. కోట్లల్లో ఫైన్ !

Update: 2021-05-17 06:38 GMT
ఆ ఇద్దరూ సోదరులు , అయితే కాలం కలిసిరాకపోవడం తో చేయని నేరానికి దాదాపుగా ముప్పై ఏళ్లు జైల్లో మగ్గిపోయారు. అయితే , ఈ మద్యే కోర్టు ఆ ఇద్దరు సోదరులు ఎటువంటి తప్పు చేయలేదని , నిర్దోషులని తేల్చింది. 30 ఏళ్ల తరువాత వారు తప్పు చేయలేదని తెలియడంతో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు.  అయితే, చేయని తప్పుకు శిక్ష అనుభవించి విలువైన కాలాన్ని కోల్పోయిన ఇద్దరు అన్నదమ్ములు కోర్టులో కేసు ఫైల్ చేస్తే వారిని అన్యాయంగా జైల్లో పెట్టిన అధికారులకి కోర్టు భారీగా ఫైన్ విధించింది. ఆ  పరిహారాన్ని ఆ ఇద్దరే పంచుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇంతకీ ఆ పరిహారం ఎంతో తెలుసా ...  రూ.550 కోట్ల (75 మిలియన్ల అమెరికా డాలర్లు).  

వివరాల్లోకి వెళ్తే...ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలీనాలో జరిగింది. 1983లో ఉత్తర కరొలినా రాజధాని రాలీలోని నార్త్‌ రాబ్సన్‌ కౌంటీ లో 11 ఏళ్ల బాలిక తన ఇంట్లో అత్యాచారంతో పాటు హత్యకు గురైంది. ఈ కేసులో హెన్రీ మెక్‌ కల్లమ్‌, లియోన్‌ బ్రౌన్‌ అనే ఇద్దరు సవతి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలు కు పంపారు. తప్పుడు సాక్ష్యాధారాలతో వారి పై రాబ్సన్‌ జిల్లా కోర్టులో అభియోగాలు మోపారు. ఆ తర్వాత  ఆ ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 2014లో ఆ ఇద్దరి డీఎన్‌ ఏ ను పరిశీలించిన తర్వాత బాలికను అత్యాచారం, హత్య చేసింది వారు కాదని, ఇంకో వ్యక్తి అయిన రోస్కో ఆర్టిస్‌ అని తేలింది. దీనితో వారిద్దరిపై కేసులను కోర్టు కొట్టి వేసింది. తప్పుడు కేసులు పెట్టి  తాము శిక్ష అనుభవించడానికి కారుకులైన జేమ్స్‌ లాక్‌ లియర్‌, కెన్నెత్‌ సీలి అనే పోలీసు అధికారులపై ఆ ఇద్దరు 2015 నుంచి కోర్టులో  పిటిషన్ వేసి, మెకల్లమ్‌, బ్రౌన్‌ కు రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలని నార్త్‌ కరోలి నా కోర్టు ఆదేశించింది. ఆ అధికారుల తరఫున వాదించిన న్యాయవాదులు రూ.66 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆ ఇద్దరు సోదరులు కూడా మానవహక్కుల ఉల్లంఘన కింద కోర్టులో పోరాడారు.
Tags:    

Similar News