బరితెగించిన టీచర్ .. బడిలోనే బార్ ఓపెన్ !

Update: 2021-03-27 01:30 GMT
ఈ ప్రపంచంలోనే కనిపించే దైవం అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది డాక్టర్ , టీచర్. ఒకరు ప్రాణాన్ని నిలబెడితే, మరొకరు విద్యాబుద్ధులు నేర్పుతారు. అయితే కొందరు టీచర్లు చేస్తున్న తప్పుడు పనుల వల్ల మొత్తం ఉపాధ్యాయ వృత్తికే మచ్చ ఏర్పడుతుంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి స్కూల్ ‌నే బార్‌గా మార్చేశాడు. విద్యార్థుల ముందే మందు కొడుతూ ,బిర్యానీ తింటూ  ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు ఓ టీచర్. అక్కడితో ఆగిపోకుండా , డ్రాయర్ వేసుకొని రాలేదనే కారణంతో ఓ విద్యార్థి బట్టలు విప్పించాడు. ఇదేంటని నిలదీయడానికి వెళ్లిన మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. వీడియో చిత్రీకరిస్తున్న ఆమెను  బట్టలు విప్పుతాను వీడియో తీసుకుంటావా అంటూ ఓ వీధి రౌడీలా మాట్లాడాడు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలనే బార్‌గా మార్చిన శ్రీధర్ అనే టీచర్, పిల్లలకి పాఠాలు చెప్పాల్సిందిపోయి విద్యార్థుల ముందే మద్యం సేవిస్తూ మత్తులో మునిగి తేలాడట. విద్యార్థులు చేసే చిన్న చిన్న తప్పులకు బెత్తంతో కొట్టడం ,ఆడ పిల్లలను బట్టలు విప్పించి తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి అనుమానిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇదేంటని అడిగిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆ టీచర్ దూషించాడు. వీడియో చిత్రీకరిస్తున్న ఓ మహిళతో బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ బరితెగించి ప్రవర్తించాడు.

విద్యాబుద్ధులు నేర్పించిన వలసిన ఉపాధ్యాయుడే.. విద్యార్థులతో ఇలా ప్రవర్తించడం అధికారులు, రాజకీయ నాయకులకు కనిపించడం లేదా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టీచర్ ఉన్న పాఠశాలకు మా పిల్లలను పంపేది లేదని తేల్చి చెప్పారు.
Tags:    

Similar News