సమాజంలో జరిగేవే సినిమాల్లో చూపిస్తున్నామంటారు కొందరు మేకర్స్.. సినిమాల్లో చూసే నేరాలు చేశామంటారు కొందరు నేరగాళ్లు! నిరంతరం సాగే.. ఈ సంవాదానికి మరిన్ని ఉదాహరణలు ఇచ్చేస్తున్నారు దొంగలు. మొన్నటికి మొన్న తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ‘భద్రమ్’ సినిమా చూపించాడో వ్యక్తి. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పించి, ఆ తర్వాత వారిని చంపేసి, ప్రమాదాలుగా చిత్రించి, ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేయడం. ఇదీ సినిమా కథ. దీన్నే యాజిటీజ్ గా అమలు చేసి, కొంతకాలం ద్వారా దొరికిపోయాడు.
నిన్నటికి నిన్న చెన్నైలో ‘బ్లఫ్ మాస్టర్’ అనే మరోసినిమాను చూపించింది ఓ గ్యాంగ్. రైస్ పుల్లింగ్ కళశాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే బిల్ గేట్స బాబాయి అయిపోవచ్చని నమ్మించి మోసం చేస్తారు ఆ సినిమాలో. అచ్చం ఇదే విధంగా రైస్ పుల్లింగ్ కాన్సెప్ట్ ను అమలు చేసింది గ్యాంగ్. దీనికి లీడర్ కూడా సినిమా నటుడే కావడం విశేషం. ఏకంగా రూ.26 కోట్ల మేర దోచేస్తే.. కక్కించే పనిలో ఉన్నారు పోలీసులు.
ఇవాళ మరోసారి తెలంగాణ జిల్లాలో జులాయి సినిమాను ఫాలో అయ్యారు దొంగలు. ఆ సినిమాలో మాదిరిగానే బ్యాంక్ చోరీకి స్క్రీన్ ప్లే వేసుకొని, పర్ఫెక్ట్ గా అమలు చేశారు. బ్యాంకు బిల్డింగ్ వెనకాల ఉన్న కిటికీని గ్యాస్ కట్టర్ తో కట్ చేశారు. లోపలికి వెళ్లిన తర్వాత అలారం మోగకుండా కనెక్షన్ కట్ చేశారు. ఎదురుగా ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాకర్ దగ్గరికి వెళ్లారు. దాన్ని కూడా తెరిచేసి సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారం, రూ.18 లక్షల నగదు తీసుకొని జంప్ అయ్యారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలోని ఎస్ బీఐ బ్రాంచ్ లో జరిగిందీ దోపిడి. వేలి ముద్రలు దొరక్కుండా గ్లౌజులు వేసుకున్నారు.. సీసీ ఫుటేజీ రికార్డయ్యే సిస్టమ్ కూడా ఎత్తుకుపోయారు. ఫైనల్ గా ఒక్క ఆధారం కూడా లేకుండా ఊడ్చేసి వెళ్లారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ఎలాగైనా ఛేదించాలని వేట మొదలు పెట్టారు. ఎంత పెద్ద దొంగైనా ఏదో తప్పు చేస్తాడని అంటారు.. ఆ లెక్కన పోలీసులు ఈ కేసును ఛేదించి.. సినిమాల్లో మాదిరిగా డబ్బును వెనక్కి పట్టుకొస్తారేమో చూడాలి.