షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఏమీ తెలీని వయసు నుంచి అన్నలయ్యే వారు తనను శారీరకంగా ఎంతలా వేధించింది.. ఎంతలా అత్యాచారం చేసిన విషయాల్ని ఏకరవు పెట్టిన కొత్తగూడెం యువతి వేదన వింటే.. షాక్ తినాల్సిందే. తనకు ఎదురవుతున్న నరకం గురించి కన్నతల్లికి చెబితే మరోలా మాట్లాడుతుందని.. పెద్దమ్మ.. పెద్దనాన్నలకు చెబితే ఇవన్నీ కామన్ అంటున్నారంటూ ఆ యువతి బరస్ట్ అయ్యింది. తనను చిత్ర హింసలకు గురి చేస్తున్న అన్నల గురించి ఒక చెల్లెలు చెప్పిన విషయాలు షాకింగ్ గా మారాయి. తనకు న్యాయం చేయాలని.. హింసను విముక్తి చేయాలని కోరుతోంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి స్థానిక ఇన్ స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ ఏం చెప్పారంటే..
‘బాధిత యువతి తండ్రి చిన్నతనంలోనే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. బాధ్యతలన్ని తల్లి మీదే పడ్డాయి. అప్పట్లో వారి కుటుంబం మణుగూరులో ఉండేది. 2009లో ఆమె తొమ్మిదో తరగతి చదువుతూ ఉండేది. సొంత అన్నయ్య ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడేవాడు. కొన్నేళ్ల క్రితం ఉద్యోగం రావటంతో కొత్తగూడెనికి వచ్చారు. ఆమె పెద్దది అవుతున్నా.. అతడు అలానే వ్యవహరించేవాడు. అతడి హింసలు తట్టుకోలేక.. ఇంటర్ చదివేటప్పుడు కొత్తగూడెంలోని పెద్దమ్మ ఇంటికి వెళితే.. అక్కడ వరసకు అన్నయ్య అని వాళ్ల పిల్లలు లైంగిక దాడికి పాల్పడేవారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాళ్లు’’

‘‘మెడిసిన్ ఎంట్రన్స్ శిక్షణ కోసం వేరే ప్రాంతానికి వెళ్లి.. లాక్ డౌన్ కారణంగా ఇంటికి రావటంతో ఆమెకు మళ్లీ నరకం మొదలైంది. ఇటీవల విద్యాసంస్థలు తెరవటంతో ఆమె బయటకు వచ్చింది. మళ్లీ మూసివేతతో.. ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన నరకం గురించి పోలీసు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసింది’’ అని పేర్కొన్నారు. తనకు తల్లి.. పెద్దమ్మ.. పెద్దనాన్నల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంది. సంచలనంగా మారిన ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కేసు నమోదు చేయటంతో భయాందోళనకు గురైన అజయ్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆమె కంప్లైంట్ ఇవ్వటంతో వారి పాపాలు బయటకు వచ్చాయి. తాము చేసిన పనులు బయటకు రావటంతో భయపడిన అజయ్.. తాజాగా సూసైడ్ చేసుకున్నాడు.