ఏది తప్పు? ఏది ఒప్పు? అన్నది చూసే కంటిని బట్టి.. చూసే సమయాన్ని..కోణాన్ని అనుసరించి ఉంటుంది. మాస్కు పెట్టుకోని వారిపై పోలీసులు సీరియస్ కావటం వరకు బాగానే ఉంటుంది. కానీ.. మరో అడుగు ముందుకేసి కఠినంగా వ్యవహరించటాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతాం. కరోనా కేసులు ఇంత భారీగా పెరిగిపోతున్న వేళ.. ముఖానికి మాస్కు పెట్టుకొని బయటకు రావాలన్న చిన్న విషయాన్ని ఇప్పటికి పట్టించుకోకపోవటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి? మాస్కు పెట్టుకోకుండా రోడ్డు మీద వెళుతున్న వారిని పోలీసులు ఆపినప్పుడు తప్పు జరిగిందని చెబితే సరిపోతుంది. అందుకు భిన్నంగా విసురుగా సమాధానం చెప్పటం.. నిర్లక్ష్యంగా రియాక్టు కావటం సరికాదు.
అలాంటివేళలో.. తప్పు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించే ధోరణిపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన తల్లీకూతురు ఇద్దరు కూరగాయల మార్కెట్ కు వచ్చారు. తల్లి ముఖానికి మాస్కు పెట్టుకోలేదు. ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అందుకు సదరు మహిళ ససేమిరా అనటంతో పాటు.. ఆమె కుమార్తె కూడా పోలీసులకు అడ్డు తగిలేప్రయత్నం చేశారు.
అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రమే ఉండటం.. మిగిలిన వారంగా మగ పోలీసులు కావటంతో.. ఆచితూచి అన్నట్లు వ్యవహరించారు. ఒక్క మహిళా కానిస్టేబుల్ ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేయగా.. తల్లీకూతుళ్లు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్కు పెట్టుకోకపోతే ఇలా కొట్టేస్తారా అని? మాస్కు పెట్టుకోకపోవటంనేరం అయినప్పడు.. ఆ నేరానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవటం పోలీసుల ప్రాథమిక విధి.
తమ పని తాము చేయటాన్ని అడ్డుకుంటూ.. ప్రతిఘటించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఈ వీడియోను చూసినప్పుడు.. మహిళా పోలీసు తోడుగా ఉన్న మగ పోలీసులు ఆచితూచి అన్నట్లు వ్యవహరించారే కానీ తొందరపడలేదు. అయితే.. నడిరోడ్డు మీద మహిళను కొడతారా? అని ప్రశ్నిస్తున్న వారు.. కొవిడ్ వేళ నిబంధనల్ని కఠినంగా అమలు చేయకపోతే.. సమస్య సదరు మహిళకే కాదు.. ఆమెపై చర్యలకు పాల్పడిన పోలీసుల్ని తప్పు పడుతున్న వారందరికి కూడా ప్రమాదమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏమైనా.. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. మీ వరకు మీరెలా ఫీల్ అవుతున్నారు?Full View Full View Full View
అలాంటివేళలో.. తప్పు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించే ధోరణిపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన తల్లీకూతురు ఇద్దరు కూరగాయల మార్కెట్ కు వచ్చారు. తల్లి ముఖానికి మాస్కు పెట్టుకోలేదు. ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అందుకు సదరు మహిళ ససేమిరా అనటంతో పాటు.. ఆమె కుమార్తె కూడా పోలీసులకు అడ్డు తగిలేప్రయత్నం చేశారు.
అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రమే ఉండటం.. మిగిలిన వారంగా మగ పోలీసులు కావటంతో.. ఆచితూచి అన్నట్లు వ్యవహరించారు. ఒక్క మహిళా కానిస్టేబుల్ ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేయగా.. తల్లీకూతుళ్లు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్కు పెట్టుకోకపోతే ఇలా కొట్టేస్తారా అని? మాస్కు పెట్టుకోకపోవటంనేరం అయినప్పడు.. ఆ నేరానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవటం పోలీసుల ప్రాథమిక విధి.
తమ పని తాము చేయటాన్ని అడ్డుకుంటూ.. ప్రతిఘటించినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఈ వీడియోను చూసినప్పుడు.. మహిళా పోలీసు తోడుగా ఉన్న మగ పోలీసులు ఆచితూచి అన్నట్లు వ్యవహరించారే కానీ తొందరపడలేదు. అయితే.. నడిరోడ్డు మీద మహిళను కొడతారా? అని ప్రశ్నిస్తున్న వారు.. కొవిడ్ వేళ నిబంధనల్ని కఠినంగా అమలు చేయకపోతే.. సమస్య సదరు మహిళకే కాదు.. ఆమెపై చర్యలకు పాల్పడిన పోలీసుల్ని తప్పు పడుతున్న వారందరికి కూడా ప్రమాదమేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏమైనా.. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. మీ వరకు మీరెలా ఫీల్ అవుతున్నారు?