సాధారణంగా పెళ్లి జరిగే సమయంలో ఆపండి అనే డైలాగ్ ఎక్కువగా సినిమాల్లో వినిపిస్తుంది. అఫ్ కోర్స్ అలా పెళ్లి జరిగే సమయంలో ఆపండి అని చెప్పే డైలాగ్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. అయితే , అది సినిమా. నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడూ అనుకోని విదంగా కొన్ని పెళ్లిళ్లు ఆగిపోతుంటారు. కొన్ని పెళ్లిళ్లు చాలా సిల్లీ రీజన్స్ కి కూడా పీటల పై ఆగిపోతుంటాయి. పెళ్లిలో ఘర్షణలు జరుగుతుండటం, వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటివి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
తాజాగా ఒడిశా రాష్ట్రంలో ఓ వివాహంలో మటన్ కూర పెద్ద వివాదానికి కారణమైంది. మటన్ కూర కారణంగా పెళ్లిని రద్దు చేసుకునేంత వరకు వెళ్లింది. పెళ్లి విందులో మటన్ కర్రీ వడ్డించలేదని ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నాడు ఓ యువకుడు. అలాగే , ఆ మరుసటి రోజే వేరే యువతి మెడ లో మూడు ముళ్లు వేసాడు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తోడు పెళ్లి కొడుకు, ఇతర బంధువులు వచ్చారు. అయితే ఈ పెళ్లిలో మటన్ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు అడిగాడు. అయితే ఆ విందులో మేక మాంసం లేదు. ఆ విషయం చెప్పగానే వరుడి తరఫు వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదం చివరికి పెద్దగా మారింది. చివరకు పెళ్లి కొడుకు పెళ్లిని రద్దు చేసుకుని తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. వరుడు అతని బంధువులు జిల్లాలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.