స్నేహితుడి బండి మీద వెళుతున్న ఆమెను ఎస్ఐ పిలుస్తున్నారంటూ..

Update: 2021-05-29 08:30 GMT
ప్రకాశం జిల్లా రాజధాని ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇలా కూడా జరుగుతుందా? అనిపించేలా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాధితురాలు.. తన స్నేహితుడి బండి మీద వెళుతోంది. వారిని వెంబడించిన ఆగంతుకుడు.. వారిని మధ్యలో ఆపి.. సదరు యువతికి సంబంధించిన వీడియోలు తమ వద్ద ఉన్నట్లుగా చెప్పాడు. తానేమీ తప్పు చేయలేదని.. ధైర్యంగా బదులివ్వటంతో.. ఎస్ ఐ పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారంటూ బెదిరించాడు.

దీంతో.. ఏం చేయాలో తోచని సదరు యువతి.. ఆగంతుడి బండి ఎక్కింది. ఆమెను.. కొత్త మామిడి పాలెం రోడ్డులోకి తీసుకెళ్లి బెదిరించి.. అత్యాచారం చేశాడు. అనంతరం వదిలేశాడు. తనకు జరిగిన దారుణ ఉదంతం గురించి స్నేహితులకు చెప్పటంతో వారు ఊరడించి.. పోలీసుల్ని సంప్రదించారు.

ఈ ఫిర్యాదుకు తక్షణమే స్పందించిన పోలీసులు బాధితురాలి నుంచి కంప్లైంట్ తీసుకొని.. అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఎస్ఐ పిలుస్తున్నారంటూ బెదిరించి రేప్ చేసిన ఉదంతం పోలీసు వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. నిందితుడి నేర చరిత్రను తవ్వి తీసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదని.. కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News