కస్టమర్​ చేతిలో మోసపోయిన టెలీకాలర్​.. న్యూడ్​ వీడియో కాల్స్​.. రచ్చ రచ్చ..!

Update: 2021-03-26 14:30 GMT
కస్టమర్​ చేతిలో ఓ టెలీకాలర్​ మోసపోయింది. అతడికి పర్సనల్​ నంబర్​ ఇచ్చి చిక్కుల్లో పడింది. అతడి నిజస్వరూపం తెలుసుకొని ఇప్పుడు లబో దిబో అంటోంది. హైదరాబాద్​కు చెందిన ఓ ప్రముఖ సంస్థలో ఓ యువతి టెలీకాలర్​గా పనిచేస్తున్నది. ఇటీవల ఆమెకు ఓ కస్టమర్​ ఫోన్​ చేశాడు. అయితే మాములుగా కస్టమర్​ కేర్​లో మాట్లాడే అమ్మాయిలు ఎవరూ? పర్సనల్​ నంబర్లు ఇవ్వరు..! కానీ సదరు యువతి ఆ కస్టమర్​ కు తన పర్సనల్​ నంబర్​ ఇచ్చేసింది. దీంతో కొంతకాలం మాట్లాడిన కస్టమర్​ ఆ తర్వాత న్యూడ్​ వీడియో కాల్స్​ చేస్తూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది.  ఈ ఘటనపై సైబర్​ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతి ఓ ప్రైవేట్‌ సంస్థలో టెలీకాలర్‌గా వర్క్​ చేస్తోంది. తన పనిలో భాగంగా  నిత్యం అనేకమందితో ఫోన్​ లో మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఛత్రినాకకు చెందిన చంద్రవేగ్​ అనే వ్యక్తి తో ఆమె ఇటీవల మాట్లాడింది. కాసేపు ఇద్దరూ వ్యాపారం గురించి మాట్లాడారు. అయితే చంద్రశేఖర్​ ఆ యువతిని మోసగించాడు. తాను సదరు సంస్థకు కస్టమర్​ గా మారాలనుకున్నానని.. ఇందుకోసం పర్సనల్​ గా కలవాలనుకుంటున్నానని యువతికి చెప్పాడు. దీంతో కస్టమర్​ దొరుకుతున్నాడన్న ఆత్రంలో ఆ యువతి అతడికి ఫోన నంబర్​ ఇచ్చింది. ఇద్దరూ కొంత కాలం పాటు ఫోన్లు, చాటింగ్​ లు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల చంద్రశేఖర్​ సదరు యువతిని వేధించడం మొదలు పెట్టాడు. అర్ధరాత్రి ఆమెకు ఫోన్లు చేయడం .. అసభ్యకర సందేశాలు పంపించడం. న్యూడ్​ వీడియో కాల్స్​ చేయడం మొదలు పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు చంద్రశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్​ నంబర్లు ఇవ్వడం.. వాట్సాప్​ చాటింగ్​ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News