అయ్యయ్యో : నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై ఒంటరిగా వెళ్తోంటే..?

Update: 2021-04-03 08:30 GMT
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్థానిక బస్ డిపో ముందు ఓ ఘోర సంఘటన చోటుచేసుకుంది. బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళ్లే అభం శుభం తెలియిని నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. చిన్నారి రోడ్డు పై నుండి చెట్ల పొదల వైపు ఈడ్చుకెళ్లాయి. అయితే ఇంకా పూర్తిగా మాటలు కూడా రాని ఆ చిన్నారి , ఏం చేయాలో తెలియక , ఆ కుక్కల దాడి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక గట్టిగా గుక్కపట్టి ఏడవసాగింది. ఆ చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పరుగులు తీసుకుంటూ వచ్చి,  ఆ కుక్కలను తరిమికొట్టారు. ఈ ఘటనలో పాపకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ... నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని స్థానిక బస్తీలో నందిని అనే ఓ చిన్నారి కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెపై వీధి కుక్కలు దాడికి దిగాయి. చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడే ఆగి ఉన్న వీధి కుక్క దాడికి దిగింది. పాపను నోట పట్టుకుని పొదల్లోకి లాక్కెళ్లిపోసాగింది. నడిరోడ్డు మీద నుంచి చివరి వరకు ఈడ్చుకెళ్లింది. ఆ కుక్కకు తోడు మరో మూడు కుక్కలు కూడా తోడవడంతో పాపను చాలా వేగంగా ఈడ్చుకుంటూ వెళ్లసాగాయి. కుక్క దాడితో చిన్నారి గట్టిగా అరుపులు పెట్టి ఏడవ సాగింది. దీంతో పాప ఏడుపు విన్న స్థానికులు వెంటనే పరుగులు తీశారు. కుక్కను తరిమికొట్టి చిన్నారిని కాపాడారు. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్క దాడిలో చిన్నారి నందిని కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీటిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు  కుక్కల స్వైర విహారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు, అధికారులు కూడా వీధి కుక్కలను కట్టడి చేయాల్సిన అవసరం ఏంతైనా ఉందని స్థానికులు చెబుతున్నారు.Full View
Tags:    

Similar News