తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజురోజుకి పెరుగుతుంది. కరోనా వ్యాప్తి పెరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా , కరోనా పాజిటివ్ కేసుల నమోదు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే .. తాజాగా తెలంగాణ మెదక్ జిల్లాలో ఓ మహిళ కరోనా లక్షణాలతో , కరోనా టెస్ట్ కోసం హాస్పిటల్ కి వచ్చింది. ఆమె కి కరోనా టెస్ట్ చేసిన వైద్యులు , కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది అని చెప్పడం తో షాక్ కి గురై నిముషాల వ్యవధిలోనే ప్రాణాలు వదిలేసింది. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పోతురాజుపల్లికి చెందిన పల్లపు శ్యామల గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనితో అనుమానం తో ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యలు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గురువారం ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్స్ లో శ్యామలకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ఆమె నిమిషాల వ్యవధిలోనే పరీక్షా కేంద్రం వద్దే ప్రాణాలు కోల్పోయింది. కరోనా నిబంధనల ప్రకారం పోతురాజుపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్యామలకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, శ్యామలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని తన తల్లిదండ్రులతోనే ఉంటుంది.
తెలంగాణలో కొనసాగుతున్న రాత్రిపూట కర్ఫ్యూను మరికొన్ని రోజులు పోడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా కర్ఫ్యూను పోడగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇదే అంశంపై నేడు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా కరోనా కేసులు విస్తృతం కావడంతో ఏప్రిల్ 20 ను విధించిన నే కర్ఫ్యూను నేటితో ముగియనుంది. కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హోమంత్రి మహమూద్ ఆలీ ఉన్నతధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకున్నారు. అన్నింటిని పరీశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ కర్ఫ్యూను పోడగించేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.