ఇదేంట్రా బాబు.. రోజుకు ఒక పెగ్గు తాగినా కష్టమేనట..!

Update: 2023-01-12 07:46 GMT
మద్యాన్ని మోతాదుకు మించి తాగితే అది మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే. వైద్యులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంటాయి. అయితే రోజుకు ఒక పెగ్గు లేదా 90 ఎంఎల్ మద్యం తాగితే అది ఆరోగ్యానికి మంచిదే కానీ చెడు కాదనేది ప్రచారంలో ఉంది. అయితే ఆ మాట తప్పని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడి కావడంతో మద్యం ప్రియులు షాకవుతున్నారు.

ఒకప్పుడు ఏమో కానీ.. ఇప్పుడైతే మద్యం అలవాటు లేని వాళ్ళు ఉన్నారంటే మాత్రం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిందే. ఎందుకంటే మద్యం తాగడం అనేది ప్రస్తుత రోజుల్లో కల్చర్ గా మారిపోతుంది. ప్రతీ ఆకేషన్లోనూ మద్యానికి ప్రాధాన్యం లభిస్తోంది. పెళ్లి రోజైన.. పుట్టిన రోజైన.. గెట్ టు గెదర్ అయినా ఇలా ఏది తీసుకున్నా మద్యం లేకుండా పార్టీలు జరగడం లేదు.

అన్నిచోట్ల ఇదే ట్రెండ్ కొనసాగుతుందని కాదు గానీ మెజారిటీ మాత్రం మద్యం లేకుండా పార్టీలు జరగడం అనేది నేటి రోజుల్లో కన్పించడం లేదు. టీనేజ్ వయస్సు నుంచే పొరగాళ్ళు బీర్లు.. బీజర్లు అంటూ నానా రచ్చ చేస్తున్నాయి. ఆడవాళ్లు సైతం మేము ఏం తక్కువ కాదంటూ డ్రంకన్ డ్రైవ్ లో సైతం అడ్డంగా బుక్కయితున్న ఘటనలు ఇటీవల కాలంలోనే అనేకం ఉన్నాయి.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యానికి ఉన్న డిమాండ్ మరేక్కడ లేదేమో. మద్యం మీదే ప్రభుత్వాలు సైతం ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలోనే మద్యం బాబులు వీఆర్ టాక్స్ ప్లేయర్స్ అంటూ మద్యం మత్తులో కాలేరేజిరేసి మరీ చెబుతున్నారు. అయితే మద్యం విషయంలోనే కాదు ఏదైనా సరే అతి అనర్థదాయకం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. .

ఈ సూత్రం మద్యానికి కూడా వర్తిస్తుంది. అందుకే కొందరు మద్యాన్ని చాలా లిమిట్ తీసుకుంటూ తమ జీవితంలో మద్యాన్ని ఒక భాగం చేసుకుంటున్నారు. రోజుకు ఒకటి అర పెగ్గులతో సంతృప్తి చెందుతున్నారు. వైద్యులు సైతం ఒకటి అర పెగ్గు తాగితే పర్వలేదనే చెబుతుంటారు. అలాంటి ఓ అధ్యయనంలో మాత్రం రోజుకు ఒక పెగ్గు తాగిన కష్టమేనని తేలిందట.

క్వాలిటీతో సంబంధం లేకుండా రోజుకు ఏ రకమైన మద్యం తాగిన రోగాల బారిన పడటం ఖాయమని తేల్చారు. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుందని కూడా వెల్లడైందట. అలాగే గుండె సంబంధిత.. టైప్-2 డయాబెటిస్ వారికి మద్యం మేలు చేస్తుందని ఆధారాలు ఏమి లేవని తేలిందని పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ వాదనను తప్పు పడుతుండటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News